For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్వీకి షాక్, ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన NSE, BSE

|

జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) సోమవారం కార్వీ స్టాక్ బ్రోకరింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఇది అన్ని విభాగలకు వర్తిస్తుంది. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NSE తెలిపింది. దీంతో పాటు BSE, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, ఎంఎస్ఈఐలు కూడా ఈ బ్రోకరేజీ సంస్థల లైసెన్స్‌ను రద్దు చేశాయి.

జనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేదంటే భారీ జరిమానా, జైలు శిక్షజనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేదంటే భారీ జరిమానా, జైలు శిక్ష

నవంబర్ 22న కార్వీ బ్రోకరేజీ సంస్థలో ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతరాలను వినియోగించినట్లు సెబీ గుర్తించడంతో సెబీ ఈ చర్యలు తీసుకున్నదని తెలుస్తోంది. దీంతో కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఖాతాదారులకు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతో పాటు ఎక్స్చేంజీలు ఈ సంస్థపై క్రమశిక్షణర్యలు తీసుకోవాలని సూచించింది.

 NSE and BSE suspend Karvy Stock Brokings license

NSE ఇటీవల తనిఖీలు నిర్వహించింది. కార్వీ స్టాక్ బ్రోకరింగ్ లిమిటెడ్ రూ.1096 కోట్లను తన గ్రూప్ కంపెనీ కార్వీ రియాల్టికీ ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 మధ్య బదలీ చేసిందని ఈ తనిఖీలో తేలింది. అలాగే, క్లయింట్ల ఖాతాల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది.

తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. మే 2019 వరకు ఈ తొమ్మిది మంది క్లయింట్లలో ఆరుగురికి చెందిన రూ.162 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీలను బదలీ చేసింది. నలుగురు క్లయింట్లకు చెందిన రూ.257 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టింది. అయితే జూన్ - ఆగస్ట్ మధ్య ఆ షేర్లను తనఖా నుంచి విడిపించుకున్నప్పటికీ అందులో రూ.218 కోట్ల విలువైన షేర్లను కార్వీ స్టాక్ బ్రోకరింగ్ లిమిటెడ్ రికవరీ చేసుకుంది.

2019లో ఆ తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన ఖాతాల్లో ఐదుగురి నుంచి రూ.228 కోట్ల విలువైన షేర్లను కార్వీ స్టాక్ బ్రోకరింగ్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 156 క్లయింట్ల ఒక్క ట్రేడ్ కూడా నిర్వహించలేదు. కానీ వారి నుంచి రూ.57.8 కోట్ల విలువైన షేర్లను బదలీ చేసింది. జూన్ 2019 నుంచి కార్వీ స్టాక్ బ్రోకరింగ్ లిమిటెడ్‌తో ఎలాంటిట్రేడింగ్ నిర్వహించనప్పటికీ 291 క్లయింట్ల నుంచి రూ.116 కోట్ల షేర్లను బదలీ చేసింది.

English summary

కార్వీకి షాక్, ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన NSE, BSE | NSE and BSE suspend Karvy Stock Broking's license

In what could mean curtains for the Hyderabad-based financial services major Karvy group's broking business, stock exchanges on Monday suspended their license for non compliance.
Story first published: Monday, December 2, 2019, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X