కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఈఎంఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెలకు మారటోరియం విధించిన ఆర్బీఐ... ఆగస్ట్ వరకు పొడిగించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారటోరియం మొదటి మూడు నెలలు ఎక్కువ మంది ఉపయోగించుకున్నారా, లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో మరెంతమంది ఉపయోగించుకుంటారు అనేది చూడాలి.

మారటోరియం ఉపయోగించుకుంది 10 శాతమే
ప్రభుత్వరంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు చెందిన కస్టమర్లు కేవలం 10% మాత్రమే ఈ మారటోరియం వెసులుబాటును ఉపయోగించుకున్నారు. ప్రయివేటు రంగ దిగ్గజం HDFC కస్టమర్లు ఈ వెసులుబాటు ఉపయోగించుకున్నది కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఎల్ఐసీ హౌసింగ్ లోన్ నుండి రుణం తీసుకున్న వారు 15 శాతం వరకే మారటోరియం ఉపయోగించుకున్నారు. యాక్సిస్ బ్యాంకుకు చెందిన కస్టమర్లు 10 శాతం నుండి 12 శాతం ఉపయోగించుకున్నారు. లోన్ వ్యాల్యూలో ఇది 25 శాతం నుండి 28 శాతం మధ్య ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంకు అయితే కేవలం 5 శాతం మంది మాత్రమే ఉపయోగించుకున్నారు.

ఈ రంగాల నుండి ఎక్కువ.. దరఖాస్తులు మరిన్ని రావొచ్చు
కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రాన్సుపోర్ట్ రంగాలు దీనిని ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. ఈ డేటా మొదటి రెండు నెలలకు సంబంధించినది. రుణగ్రహీతలు మారటోరియం ఆప్షన్ ఎంచుకోవడానికి ఈ తేదీలోపు అనే గడువు లేదు. కాబట్టి బ్యాంకులకు వరుసగా దరఖాస్తులు వస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పూర్తిగా లాక్ డౌన్ నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే వచ్చే నెల నుండి ఆర్బీఐ మారటోరియం మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఇవ్వాలి.

నగదు ఉన్నా..
కొంతమంది లేదా కొన్ని సంస్థల వద్ద నగదు ఉన్నప్పటికీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మారటోరియం ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. చేతిలో లిక్విడిటీ పెట్టుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి సంస్థలు. అలాగే ఉద్యోగాల కోత, శాలరీ కోత భయంతో ఉద్యోగులు దీనిని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల ఎంఎస్ఎంఈ రుణ పుస్తకం వ్యాల్యూ రూ.90 లక్షల కోట్లుగా ఉంది. రుణాల్లో ఈ వాటా 20 శాతం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications