For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కనికరించిన నిర్మలమ్మ: బ్లాక్ ఫంగస్‌ మెడిసిన్‌పై నో జీఎస్టీ: వాటిపై భారీగా తగ్గింపు

|

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోన్న వేళ.. అన్ని రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు క్షీణిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ పూరక వాతావరణం దేశాన్ని చుట్టుముట్టిన సందర్భంలో ఎట్టకేలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోన్న బ్లాక్ ఫంగస్ నివారణకు ఉద్దేశించిన మెడిసిన్లపై ఎలాంటి జీఎస్టీని వసూలు చేయట్లేదని ఆమె వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో పాటు కోవిడ్ 19 సంబంధిత వైద్య పరికరాలకూ ఇది వర్తిస్తుందని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై నో జీఎస్టీ

బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై నో జీఎస్టీ

దేశ రాజధాని వేదికగా నిర్మల సీతారామన్ సారధ్యంలో ఏర్పాటైన 44వ వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (44 GST Cuncil meeting) కొద్దిసేపటి కిందటే ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మల సీతారామన్ వెల్లడించారు. దీనికోసం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. బ్లాక్ ఫంగస్‌ను నివారించడానికి వినియోగించే యాంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్ వంటి మెడిసిన్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసినట్లు ఆమె తెలిపారు. ఇది వచ్చే సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు.

అంబులెన్స్ సేవలపై ట్యాక్స్ 28 నుంచి 12 శాతానికి

అంబులెన్స్ సేవలపై ట్యాక్స్ 28 నుంచి 12 శాతానికి

ఆయా మెడిసిన్లపై ఆగస్టు చివరివారం వరకే జీఎస్టీని ఎత్తేయాలంటూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం సూచించినప్పటికీ.. పరిస్థితులను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరోో నెల రోజులు అదనంగా చేర్చినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను నివారించడానికి వినియోగించే అన్ని రకాల వస్తువులు, ఐసీయూ పరికరాలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లపై ఇప్పటిదాకా 18 శాతంగా ఉన్న జీఎస్టీని వరుసగా 12, 5 శాతానికి తగ్గించినట్లు వివరించారు. అంబులెన్స్ సర్వీసులపై ప్రస్తుతం విధించిన 28 శాతం జీఎస్టీని కూడా భారీగా కుదించామని అన్నారు. అంబులెన్స్ సర్వీసులపై ఉన్న విధించిన 28 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించామని నిర్మల సీతారామన్ వెల్లడించారు.

ఫర్నేస్‌లపై జీఎస్టీ కుదింపు..

ఫర్నేస్‌లపై జీఎస్టీ కుదింపు..

శ్మశాన వాటికల్లో మృతదేహాలను దహనం చేయడానికి వినియోగించే గ్యాస్, ఎలక్ట్రిక్ ఆధారిత ఫర్నేస్‌లపై వసూలు చేస్తోన్న జీఎస్టీని కూడా తగ్గంచామని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా అలాంటి ఫర్నేస్‌లపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోండగా.. దాన్ని అయిదు శాతానికి కుదించామని అన్నారు. ఫర్నేస్‌ల ఇన్‌స్టాల్లేషన్‌కు కూడా ఇదే వర్తిస్తుందని అన్నారు. అంబులన్స్ సేవలపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి కుదించామని తెలిపారు. బ్లాక్ ఫంగస్‌ను నివారించడానికి వినియోగించే యాంఫోటెరిసిన్ బీ (Amphotericin B), టోసిలిజుమాబ్ (Tocilizumab) వంటి మెడిసిన్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసినట్లు ఆమె తెలిపారు. ఇది వచ్చే సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు.

శానిటైజర్లపై జీఎస్టీ తగ్గింపు

శానిటైజర్లపై జీఎస్టీ తగ్గింపు

ఎలక్ట్రిక్ ఫర్నేసెస్, టెంపరేచర్‌ను తనఖీ చేసే వస్తువులపై వసూలు చేస్తోన్న జీఎస్టీని అయిదు శాతానికి తగ్గించామని వివరించారు. హ్యాండ్ శానిటైజర్ల రేట్లపై వసూలు చేసే జీఎస్టీని భారీగా తగ్గించామని అన్నారు. ఇదివరకు 18 శాతంగా ఉన్న వాటి జీఎస్టీని అయిదు శాతానికి తగ్గించామని చెప్పారు. ఫలితంగా- వాటి బహిరంగ మార్కెట్‌లో వాటి రేట్లు భారీగా తగ్గుతాయని ఆమె వివరించారు. పల్స్ ఆక్సీమీటర్లకూ ఇదే విధానాన్ని వర్తింపజేశామని అన్నారు. ఫలితంగా వాటి రేట్లు తగ్గుతాయని అన్నారు.

English summary

కనికరించిన నిర్మలమ్మ: బ్లాక్ ఫంగస్‌ మెడిసిన్‌పై నో జీఎస్టీ: వాటిపై భారీగా తగ్గింపు | No tax on Black Fungus medicine and GST brought down to 5% on these equipment: FM

Central Finance Minister Nirmala Sitharaman told in Press conference after 44th GST Council meeting that slashes tax on Black Fungus medicine, other Covid19 essentials and GST brought down to 5% on these equipment.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X