For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రైవ్ చేయలేకపోవచ్చు.. కానీ కొనుగోలు చేస్తున్నారు!! టెస్లా పట్ల భారతీయుల ఆసక్తి

|

వాషింగ్టన్: మీరు ఈ కారును డ్రైవ్ చేయలేకపోవచ్చు! కానీ కొనుగోలు చేయవచ్చు! కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఇది పెట్టుబడి కోసం. ఆ కంపెనీ అంతర్జాతీయ దిగ్గజం టెస్లా. ఈ కంపెనీ స్టాక్ ఈ ఏడాది భారీగా ఎగిసింది. కరోనా మహమ్మారి సమయంలో టెస్లా స్టాక్ 648 శాతం ఎగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 616 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎస్ అండ్ పీ 500లో ఆరో అతిపెద్ద కంపెనీ టెస్లా. గత కొద్దికాలంగా షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న భారతీయులు ఈ స్టాక్‌లోను భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఉద్యోగులకు అలర్ట్: ఏప్రిల్ నుండి టేక్-హోం శాలరీలో కోత! ఎందుకు.. లాభమా.. నష్టమా?ఉద్యోగులకు అలర్ట్: ఏప్రిల్ నుండి టేక్-హోం శాలరీలో కోత! ఎందుకు.. లాభమా.. నష్టమా?

టెస్లా సహా అమెరికా స్టాక్స్‌పై ఆసక్తి

టెస్లా సహా అమెరికా స్టాక్స్‌పై ఆసక్తి

ఈ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం (టెస్లా ఇంక్) కార్లపై దేశీయంగా పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన టెస్లా కౌంటర్‌లోను పెట్టుబడులకు భారత ఇన్వెస్టర్లు వరుస కడుతున్నారు. దేశీయంగా టెస్లా తయారీ కార్లు అందుబాటులో లేవు. అయినప్పటికీ అటు కంపెనీ కార్లు కొనేందుకు, అలాగే, ఇటు షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది భారతీయులు ముందుకు వస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే అమెరికా మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. ఈ సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు అమెరికా స్టాక్స్ పైన ఆసక్తి చూపుతున్నారు.

టెస్లా స్టాక్స్ వైపుదృష్టి

టెస్లా స్టాక్స్ వైపుదృష్టి

ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలకు భారత్‌లో సుపరిచితం. వీటిల్లో ఇన్వెస్ట్ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయులు ఎక్కువగా కొంటున్న అమెరికా స్టాక్స్‌లో టెస్లా ముందుందట. మార్చి చివరికి టెస్లా స్టాక్స్‌లో 76,000 డాలర్లు ఇన్వెస్ట్ చేయగా, నవంబర్ నాటికి 2.5 మిలియన్ డాలర్లుగా ఉందని ఇండియన్ బ్రోకరేజీ సంస్థ వెస్టెడ్ ఫైనాన్స్ చెబుతోంది. ఈ కాలంలో టెస్లా హోల్డింగ్స్ నాలుగు రెట్లు పెరిగి 10 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయని మరో బ్రోకరేజీ స్టాక్కాల్ తెలిపింది.

ఉనికి లేనప్పటికీ..

ఉనికి లేనప్పటికీ..

చాలామంది ఇన్వెస్టర్లు టెస్లాలో ఇన్వెస్ట్ చేయడం కోసం అకౌంట్ క్రియేట్ చేసుకున్నారని వెస్టెడ్స్ సీఈవో విక్రమ్ షా అన్నారు. దేశంలో ఉనికి లేనప్పటికీ ఈ కంపెనీ స్టాక్ ఇంతలా పెరగడం గమనార్హమని, ఇది ఊహించనిదని అంటున్నారు. 33 ఏళ్ళ గౌరవ్ అనే వ్యక్తి టెస్లా ఇంక్ తయారీ మోడల్ 3 కారు కోసం ముందస్తుగా వెయ్యి డాలర్లను బుకింగ్ ఫీజుగా చెల్లించారు. మే నెలలో టెస్లా ఇంక్ షేర్లలో వెయ్యి డాలర్లను ఇన్వెస్ట్ చశాడు. తర్వాత 30 షేర్ల చొప్పున సిప్ కింద కొనుగోలు చేస్తన్నట్లు తెలిపారు.

English summary

డ్రైవ్ చేయలేకపోవచ్చు.. కానీ కొనుగోలు చేస్తున్నారు!! టెస్లా పట్ల భారతీయుల ఆసక్తి | No model for sale, but India's small investors flock to Tesla stock

Mom-and-pop Indian investors increasingly buying US stocks have been drawn to a company that has no presence in India so far: electric car maker Tesla Inc.
Story first published: Thursday, December 10, 2020, 18:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X