For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త శిఖరాలకు..: 41,000 దాటిన సెన్సెక్స్, 12,120 మార్క్ దాటిన నిఫ్టీ

|

ముంబై: స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, కార్పోరేట్ ట్యాక్స్ ఊరట, ఉద్దీపన ప్రకటనలు, అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశల నేపథ్యంలో సోమవారం గరిష్టాలను తాకిన సూచీలు మంగళవారం కూడా దూసుకెళ్తున్నాయి. నిన్నటి రికార్డులను చెరిపివేశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ రూ.10 లక్షల కోట్ల మార్కుకు సమీపంలో ఉంది.

సెన్సెక్స్ 200 పాయింటిలి ఎగిసి 41,000 మార్క్ దాటింది. నిఫ్టీ కూడా 12,100 మార్క్ దాటింది. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 185.46 పాయింట్లు లేదా 0.45 శాతం లాభంతో 41,074 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 50.10 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 12,123.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 564 షేర్లు లాభాల్లో, 179 షేర్లు నష్టాల్లో ఉండగా, 29 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆ తర్వాత సెన్సెక్స్ 41 వేల మార్క్ దాటింది.

మార్కెట్ సరికొత్త రికార్డ్, రూ.1.81 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే!మార్కెట్ సరికొత్త రికార్డ్, రూ.1.81 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే!

Nifty at fresh record high of 12,120, Sensex tops 41,000

ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు, ఎస్బీఐఎన్, ఏషియన్ పేయింట్స్, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, హిందుస్తాన్ యూనీలీవర్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. వేదాంత, ఎల్ అండ్ టీ, కొటక్ బ్యాంకు, మారుతీ, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్ టెల్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి 71.67 వద్ద ట్రేడ్ అయింది.

English summary

కొత్త శిఖరాలకు..: 41,000 దాటిన సెన్సెక్స్, 12,120 మార్క్ దాటిన నిఫ్టీ | Nifty at fresh record high of 12,120, Sensex tops 41,000

Sensex opens to a record high, and is up 185.46 points or 0.45% at 41074.69. Nifty at fresh record high of 12,120; Sensex tops 41,000. RIL m-cap nears Rs 10 lakh crore mark.
Story first published: Tuesday, November 26, 2019, 10:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X