For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, డాలర్‌తో బలపడిన రూపాయి

|

స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మే 8) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 521.55 పాయింట్లు లేదా 1.66% ఎగిసి 31,964.93 వద్ద, నిఫ్టీ 152.60 పాయింట్లు లేదా 1.66% పెరిగి 9,351.65 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 583 షేర్లు లాభాల్లో, 109 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 22 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

2 నెలలు అనుకుంటే..: కొటక్ మహీంద్రా కీలక నిర్ణయం, ఆ ఉద్యోగుల వేతనాల్లో 10% కోత2 నెలలు అనుకుంటే..: కొటక్ మహీంద్రా కీలక నిర్ణయం, ఆ ఉద్యోగుల వేతనాల్లో 10% కోత

అమెరికాకు చెందిన విస్తా ఈక్విటీ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రిలయన్స్ షేర్ ధర 3 శాతానికి పైగా లాభపడింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3% వాటాను దక్కించుకునేందుకు ఇన్వెస్ట్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ కంపెనీ. ఈ మేరకు గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రిలయన్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి.

 Nifty above 9,300, Sensex in the green: Rupee opens at 75.42 per dollar

టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, ఐవోసీ ఉన్నాయి.
అమెరికా డాలర్ మారకంతో మధ్యాహ్నం సమయానికి రూపాయి 39 పైసలు ఎగిసి 75.37 వద్ద ట్రేడి అయింది. బుధవారం 75.76 వద్ద ముగిసింది. ఉదయం 75.42 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, డాలర్‌తో బలపడిన రూపాయి | Nifty above 9,300, Sensex in the green: Rupee opens at 75.42 per dollar

Indian indices opened on positive note on May 8 with Nifty above 9400 level and Sensex reclaimed the 32000 mark. At 09:16 IST, the Sensex is up 521.55 points or 1.66% at 31964.93, and the Nifty up 152.60 points or 1.66% at 9351.65. About 583 shares have advanced, 109 shares declined, and 22 shares are unchanged.
Story first published: Friday, May 8, 2020, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X