For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కొత్త ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారా?

|

చాలా కాలం తర్వాత మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త ఫండ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పెట్టుబడులు పెట్టాలని భావించే ఇన్వెస్టర్లు వీటి ప్రధాన ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.

* డెట్ సాధనాలైన ప్రభుత్వ సెక్యూరిటీలు, పీఎస్ యు, కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి పరిమిత వడ్డీ రేటు రిస్క్ తో ఇన్వెస్టర్లకు రెగ్యులర్ గా ఆదాయం, మూలధన వృద్ధిని అందించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

* ఇది ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ పథకం.
* ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 21న ప్రారంభం కాగా ఈ నెల 26న ముగుస్తుంది.
* ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000
* ఈ పథకానికి సంభందించిన పూర్తి సమాచారం కోసం www.sbimf.com వెబ్ సైట్ లోకి లాగ్ ఇన్ కావొచ్చు.

టాటా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్

టాటా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్

* ఈక్విటీ, ఈక్విటీ సంభందిత సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మూలధనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో టాటా మ్యూచువల్ ఫండ్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

* ఈక్విటీ స్కీం - ఫోకస్డ్ ఫండ్ కేటగిరీ లో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

* ఈ నెల 15న ప్రారంభమైన ఈ ఫండ్ ఆఫర్ 29న ముగియనుంది.

* ఎంట్రీ లోడ్ లేదు. అలాట్ మెంట్ తర్వాతి ఏడాది లోపు రిడీమ్ చేసుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ వసూలు చేస్తారు.

* ఈ స్కీం లో కనీస పెట్టుబడి రూ.5,000

యూనియన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్

యూనియన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్

* లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపనీలకు చెందిన ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూలధనాన్ని పెంచాలన్నది ఈ పథకం ఉద్దేశం.

* ఈక్విటీ స్కీం - లార్జ్ - మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీ లో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

* ఈ నెల 15న ప్రారంభమైన ఈ ఫండ్ ఆఫర్ ఈ నెల 29న ముగియనుంది.

* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000

* ఎంట్రీ లోడ్ లేదు. ఏడాది లోపు రిడీమ్ చేసుకుంటే మాత్రం ఒక శాతం ఎగ్జిట్ లోడ్ వసూలు చేస్తారు.

మహీంద్రా టాప్ 250 నివేశ్ యోజన

మహీంద్రా టాప్ 250 నివేశ్ యోజన

* లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంభందిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో మూలధనాన్ని పెంచుకోవాలని భావించే ఇన్వెస్టర్ల కోసం ఈ స్కీం ను మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ప్రారంభించింది.

* ఈ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 6న ప్రారంభమై 20 న ముగుస్తుంది.

* ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీం.

English summary

ఈ కొత్త ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారా? | New Mutual fund schemes are available for the investors

Mutual fund companies have made available few new funds for the investors. After few months these funds have been launched by the companies.
Story first published: Sunday, November 24, 2019, 9:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X