ముంబై: విప్రో స్టాక్స్ గత ఐదు నెలల కాలంలో 70 శాతం మేర లాభపడింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెలలో మార్కెట్లకు అనుగుణంగా ఈ స్టాక్ రూ.250 నుండి రూ.165 కిందకు పడిపోయింది. అన్-లాక్ తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. గత రెండు మూడు నెలలుగా మార్కెట్లు జంప్ చేస్తున్నాయి. విప్రో స్టాక్ కూడా భారీగా ఎగిసింది. కేవలం 5 నెలల కాలంలో డెబ్బై శాతం ఎగిసింది. విప్రో స్టాక్స్ నేడు 0.58 శాతం నష్టపోయి రూ.358.70 వద్ద ముగిసింది. ఓ దశలో ఈ స్టాక్ రూ.377ని దాటింది.

కొత్త సీఈవో ఆఫీస్‌లో అడుగు పెట్టకుండానే..
కంపెనీ చీఫ్‌గా థియెర్రీ డెలాఫోర్ట్ బాధ్యతలు చేపట్టి 5 నెలలు అవుతోంది. ఫ్రాన్స్ ఐటి దిగ్గజం క్యాప్ జెమిని ఎస్ఈ నుండి విప్రోకు సీఈవోగా వచ్చారు. ఈయన వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన మిగతా ఐటీ దిగ్గజాల షేర్ల కంటే విప్రో అధికంగా లాభపడింది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఆయన ప్యారిస్ నుండే విప్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టాక ఒక్కసారి కూడా బెంగళూరులోని విప్రో ప్రధాన కార్యాలయానికి రాలేదు. అంటే ఆఫీస్‌లో అడుగు పెట్టకుండానే ఆయన నేతృత్వంలో స్టాక్స్ జంప్ చేస్తున్నాయి.

లీడర్‌షిప్స్ పొజిషన్ల సంఖ్య 25 నుండి 4కు..
కరోనా నేపథ్యంలో కంపెనీపై ప్రభావం లేకుండా శాయశక్తులా కృషి చేస్తున్నారు. కస్టమర్లతోపాటు మేనేజర్లు, సిబ్బందితో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విప్రోలో లీడర్‌షిప్ పొజిషన్ల సంఖ్యను 25 నుంచి నాలుగుకు తగ్గించారు. కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. క్లయింట్స్‌తో 130కు పైగా సమావేశాల ద్వారా యూరోప్, అమెరికా నుండి మల్టీఇయర్ కాంట్రాక్ట్స్ దక్కించుకున్నారు. ఆయన హయాంలో ఇతర స్టాక్స్ కంటే విప్రో స్టాక్ భారీగా ర్యాలీ చేసిందని, ఇది ఆరంభమేనని, ఇంకా కొనసాగుతుందని అంటున్నారు.

ఆదాయాలు ఇలా..
మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీలో ఆదాయం 3.6 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ లిమిటెడ్ 9.8 శాతం, టీసీఎస్ 7.1 శాతం పెరిగింది. రెండేళ్ల క్రితం విప్రోను వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి వచ్చిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 17 శాతం వృద్ధి సాధించింది. 2016లో విప్రో పగ్గాలు చేపట్టిన అబిదబీ నీముచ్‌వాలా కంపెనీని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు. నాలుగేళ్లలో ఆశించన పురోగతిని సాధించలేకపోయారని అంటారు. 2020 నాటికి విప్రోను 15 బిలియన్ డాలర్ల సంస్థగా నిర్మించే ప్రయత్నాలు ఫలించలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. కొత్త డీల్స్ కోసం డెలాఫోర్ట్ టీంను ఏర్పాటు చేశారు. ఐటీ పరిశ్రమలో ఇప్పుడు కీలక పరిస్థితులు నెలకొన్నాయని ఓ ఇంటర్వ్యూలో డెలాఫోర్ట్ అన్నారు.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications