For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ దేశం సుంకం పెంచింది.. ఇక మన దేశానికి స్మగ్లింగ్ తగ్గుతుందా?

|

అడ్డదారిలో ఒక దేశం నుంచి మరొక దేశంలోకి వస్తువులు ప్రవేశిస్తే దాన్ని స్మగ్లింగ్ గా భావిస్తారు. పన్నులు ఎగవేసేందుకు అనేక మంది ఈ అక్రమ దారిని ఎంచుకుంటారు. దీని వల్ల ఒక దేశానికి సుంకాల ద్వారా వచ్చే రాబడిపై దెబ్బ పడుతుంది. అంతే కాకుండా దీనివల్ల అక్రమ లావాదేవీలు పెరిగిపోతాయి. అయితే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నా ఈ దందా జరుగుతూనే ఉంది.

ఈ వ్యాపారంలో ఎక్కువ లాభం ఉన్నపుడే దీని నిర్వహణకు స్మగ్లర్లు ముందుకు వస్తుంటారు. ఒకవేళ లాభం లేకపోతే మాత్రం కొన్నాళ్ళు అలా సైలెంట్ గా ఉండిపోతారు. ముఖ్యంగా మనం ఎక్కువగా బంగారం స్మగ్లింగ్ గురించి వింటుంటాం. మన దేశంలో సుంకాలను పెంచినప్పుడు స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంటుందన్న వార్తలు వినిపిస్తుంటాయి.

విస్తరణ దిశగా ముత్తూట్ ఫైనాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో 60 కొత్త శాఖలు!విస్తరణ దిశగా ముత్తూట్ ఫైనాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో 60 కొత్త శాఖలు!

నేపాల్ సుంకం పెంచింది...

నేపాల్ సుంకం పెంచింది...

* మన పొరుగు దేశం నేపాల్ బంగారంతో పాటు వెండి పై కూడా దిగుమతి సుంకం పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రెండు దేశాలకు కూడా ప్రయోజనం లభిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. నేపాల్ లో ఇప్పుడు బంగారంపై దిగుమతి సుంకం 10.5-11.5 శాతంగా ఉంది.

* చైనా నుంచి నేపాల్ కు బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ దేశంనుంచి మన దేశంలోకి కూడా బంగారం స్మగ్లింగ్ అవుతోందట. అయితే ఇప్పుడు నేపాల్ సుంకాలను పెంచడం వల్ల స్మగ్లింగ్ తగ్గు ముఖం పట్ట వచ్చని భావిస్తున్నారు.

గత ఏడాది 100 టన్నులు

గత ఏడాది 100 టన్నులు

* గత ఏడాదిలో మన దేశానికి 100 టన్నుల బంగారం స్మగ్లలింగ్ ద్వారా వచ్చిందట. ఇందులో నేపాల్, శ్రీలంక నుంచి వచ్చిన మొత్తం కూడా ఎక్కువే ఉంటుందని అంటున్నారు.

*సాధారణంగా మన దేశం వార్షికంగా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

* గత బడ్జెట్ లో ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. అప్పటి నుంచి స్మగ్లింగ్ ఇంకా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ మన దేశంలో వినియోగం తగ్గిపోతున్నట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి.

* గత జులై నుంచి నాలుగు నెలల్లో భారత్ బంగారం దిగుమతులు 120 టన్నులు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇది దేశ బంగారం వినియోగంలో 30-35 శాతానికి సమానం.

* మనదేశంలో డిమాండ్ తగ్గినందువల్ల స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

అనైతిక వ్యాపారులకు దెబ్బ

అనైతిక వ్యాపారులకు దెబ్బ

* స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడం వల్ల అనేక మంది దందాలపై దెబ్బ పడే అవకాశం ఏర్పడనుంది. మన దేశాన్ని కొంత మంది స్మగ్లింగ్ కు వాడుకుంటున్నట్టు కొన్ని నివేదికల ద్వారా వెల్లడవుతోంది.

English summary

ఆ దేశం సుంకం పెంచింది.. ఇక మన దేశానికి స్మగ్లింగ్ తగ్గుతుందా? | Nepal's increased Gold import duty to help India reduce smuggling

Neighbouring country Nepal has increased import duty on gold. This decision is expected to help both Nepal and India. Last year, India was estimated to have received over 100 tonnes of smuggled gold. In the four months since July gold import has been around 120 tonnes.
Story first published: Saturday, November 30, 2019, 11:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X