For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాన్ మస్క్ కలలే వేరు: 2050కి 10 లక్షలమందిని అక్కడికి పంపిస్తాడట, మీరూ వెళతారా?

|

ఎలాన్ మస్క్. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త. అధునాతన టెక్నాలజీ కంపెనీల సృష్టికర్త. ప్రైవేట్ రాకెట్ల ను అంతరిక్షం లోకి పంపించే స్పేస్ ఎక్స్ కంపెనీ, ఎలక్ట్రిక్ కార్లు, ట్రక్ లను తయారు చేసే టెస్లా కంపెనీ కూడా ఎలాన్ మస్క్ ఏర్పాటు చేసినవే. ఇప్పుడు అయన ఒక పెద్ద కలనే కంటున్నారు. అదేమిటంటే 2050 నాటికి 10లక్షల మందిని మార్స్ (అంగారకుడు) పైకి తీసుకెళ్లాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. ఒక దేశం నుంచి మరో దేశం పోవాలంటేనే ఎంతో ప్రయాస పడే సమయంలోనే అయన ఏకంగా మార్స్ కు డైలీ ఫ్లైట్స్ నడిపే యోచనలు చేస్తున్నారు.

ఈయన కళలను ముందు చాలా మంది నమ్మలేదు. కానీ ఇప్పుడిప్పుడే సామాన్యులకు కూడా అయన సత్తా ఏమిటో అర్థం అవుతోంది. ఎందుకంటే, ఒక రాకెట్ తయారు చేయాలంటేనే పెద్ద పెద్ద దేశాలు కిందా మీదా పడతాయి. ఇందుకు అమెరికా అయినా ఇండియా ఐన అతీతం ఏమి కాదు. కానీ ఎలాన్ మస్క్ అన్నంత పనిచేశాడు. ప్రైవేటుగా రాకెట్ ను తయారు చేశాడు. అలాగే పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేసే కార్లు తయారు చేస్తానంటే అంతా నవ్వుకున్నారు. కానీ అయన ఇటీవలే విజయవంతంగా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ ట్రక్ లను కూడా మార్కెట్లోకి విడుదల చేసారు. పైగా అవి బులెట్ ప్రూఫ్ కావటం విశేషం.

మింత్రతో జతకట్టిన మహేష్ బాబు బ్రాండ్: రూ.599 నుంచి ధర ప్రారమింత్రతో జతకట్టిన మహేష్ బాబు బ్రాండ్: రూ.599 నుంచి ధర ప్రార

రోజుకు 3 ఫ్లైట్స్...

రోజుకు 3 ఫ్లైట్స్...

వినడానికి ఇది కొంత విచిత్రంగా అనిపించినా... ఎలాన్ మస్క్ మాత్రం ఇదే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. భూమి మీది నుంచి రోజుకు 3 ఫ్లైట్ల ను అంగారకుడిపైకి నడపాలని కంకణం కట్టుకున్నాడు. అంటే ఏడాదికి దాదాపు 1,000 ఫ్లైట్లు భూమి మీద నుండి మార్స్ పైకి ఎగరాలి. హైదరాబాద్ నుంచి అమెరికా కు రోజుకు ఒకటో రెండో డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. కానీ ఎలాన్ మస్క్ చెప్పేది వింటే దిమ్మ తిరగటం ఖాయం. ఎందుకంటే, ఇప్పటివరకు అంగారకుడిపై అసలు ఒక్క మనిషి కూడా అడుగుపెట్టలేదు. 2025 లో మాత్రమే అది సాధ్యమని అంటున్నారు. అలాంటిది ఎలాన్ మస్క్ మాత్రం ఏకంగా 10 లక్షల మందిని తీసుకెళతానని లెక్కలు కట్టి మరీ చెబుతుండటం విశేషం. అంగారకుడిపై మానవులు ఉండేలా వాతావరణాన్ని సృష్టించేందుకు కనీసం 1 మెగా టన్ను (10 లక్షల టన్నులు) పదార్ధం అవసరం. ఇందుకోసం ప్రతి 10 ఫ్లైట్ల లో ఒక మెగా టన్ను సరుకులను మోసుకు పోగలమని అయన అంచనా. ఎలాన్ మస్క్ ట్వీట్ల ఆధారంగా ప్రముఖ వార్త ఏజెన్సీ ఐ ఏ ఎన్ ఎస్ ఒక కథనాన్ని ప్రచురించింది.

నాసా కు విజ్ఞప్తి...

నాసా కు విజ్ఞప్తి...

అమెరికా లోని టెక్సాస్ లో స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రస్తుతం ప్రొటోటైప్ రాకెట్ల తయారీ ముమ్మరంగా చేపడుతోంది. అంగారకుడి పైకి వెళ్లే స్టార్షిప్ విమానాల తయారీ జరుగుతోంది. ఈ విమానాలు అన్నీ కూడా అటు ప్రయాణికులను మోసుకెళ్ళటంతో పాటు సరుకులను కూడా మోసుకెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించేందుకు పనికి వచ్చేలా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడి పై తమ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కొన్ని ల్యాండింగ్ స్లాట్ లు (ప్రదేశాలు) కేటాయించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ను స్పేస్ ఎక్స్ అనుమతి కోరుతోంది. ఏడాదికి 1,000 స్టార్షిప్ లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

భారీ ఖర్చు...

భారీ ఖర్చు...

ఇండియా నుంచి అమెరికా వెళ్లాలంటేనే రూ లక్షల్లో ఫ్లైట్ టికెట్ ఉంటుంది. అలాంటిది లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ... వేరొక గ్రాహం పై నివాసం ఏర్పరచుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఊహించటానికి కూడా కష్టమే. కానీ ఎలాన్ మస్క్ మాత్రం అప్పుడే ఆ లెక్కలూ కట్టేశారు. అంగారకుడిపై సొంతంగా మనుషులు నివాసం ఏర్పరచుకోవడం కోసం 100 బిలియన్ డాలర్ల (10,000 కోట్ల డాలర్లు) నుంచి 10 ట్రిలియన్ డాలర్ల (10 లక్షల కోట్ల డాలర్లు) ఖర్చు కాగలదని అంచనా వేశారు. అయితే, ఈ ఖర్చును ఎవరు భరిస్తారు, ఒక్కో వ్యక్తి భూమి పై నుంచి మార్స్ పైకి వెళ్లేందుకు టికెట్ ధర ఎంత ఉంటుందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఎలాన్ మస్క్ చెబుతున్నది జరుగుతుందని భావిస్తే, మీకు కూడా అంగారకుడిపై వెళ్లాలని ఉంటె... ఇప్పుడే ఎలాన్ మస్క్ కంపెనీ ని సంప్రదించి ముందస్తు బుకింగ్ చేసేసుకోండి. లేదంటే, ముందు ముందు టిక్కెట్ల ధరలు పెరిగిపోతాయేమో!

English summary

ఎలాన్ మస్క్ కలలే వేరు: 2050కి 10 లక్షలమందిని అక్కడికి పంపిస్తాడట, మీరూ వెళతారా? | Musk aims to send 10 lakh people to Mars by 2050

SpaceX CEO Elon Musk aims to send 10 lakh people to Mars by 2050 and in a series of tweets, has revealed how is he going to achieve the daunting task of colonising the Red Planet and make humans beings 'multiplanetary'.
Story first published: Sunday, January 19, 2020, 21:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X