రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర సోమవారం దాదాపు 9 శాతం పడిపోవడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది. స్టాక్ పతనం కావడంతో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ సంపద కూడా భారీగా తగ్గిపోయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం క్షీణించాయి. ఇది స్టాక్ పైన ప్రభావం చూపింది. శుక్రవారం రూ.2,054కు పడిపోయిన రిలయన్స్ షేర్, సోమవారం 8.69 శాతం దిగజారి రూ.1,876కు చేరుకుంది. మార్చి 23వ తేదీ తర్వాత ఇదే భారీ పతనం.

మూడు స్థానాలు దిగజారిన ముఖేష్ అంబానీ
షేర్ హోల్డర్లు లక్షకోట్ల రూపాయల మేర నష్టపోయారు. దీంతో మార్కెట్ క్యాప్ రూ.12,64,061.50 లక్షల కోట్లకు పడిపోయింది. గత నెలల్లో రూ.15 లక్షల కోట్లను దాటిన రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.13 లక్షలకోట్ల దిగువకు చేరింది. ముఖేష్ అంబానీ నికర ఆదాయంలో 6.8 బిలియన్ డాలర్లు క్షీణించింది. దీంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో ఆయన 6వ స్థానం నుండి 9వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ నికర ఆదాయం 71.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

వరుస పెట్టుబడులతో ఎగిసిన స్టాక్ ధర
రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి వరుస పెట్టుబడుల నేపథ్యంలో ఈ స్టాక్ ధర ఓ సమయంలో రూ.2,300ను దాటి సెప్టెంబర్ 16న రూ.2,368ని తాకింది. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు రూ.500 వరకు (20.7 శాతం) తక్కువగా ఉంది. ముఖేష్ అంబానీ ఇటీవల ఎనర్జీ సెక్టార్ పైన ఆధారపడటం తగ్గించి, డిజిటల్ వ్యాపారంపై మరింతగా దృష్టి సారిస్తున్నారు. రిలయన్స్ షేర్ ఈ ఏడాది దాదాపు 30 శాతం లాభపడింది. అదే సమయంలో సెన్సెక్స్ 4 శాతం నష్టపోయింది. 2020లో అంబానీ సంపద 19.1 బిలియన్ డాలర్లు పెరగడంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ప్రపంచ ఆరో కుబేరుడిగా నిలిచారు. నిన్న స్టాక్ పడిపోవడంతో 9వ స్థానానికి పడిపోయారు.

మార్చి కంటే 116 శాతం ఎక్కువ
మార్చి నెలలో రిలయన్స్ స్టాక్ రూ.900 దిగువకు వచ్చింది. కరోనా కారణంగా అప్పుడు మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో అన్ని కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అన్-లాక్ తర్వాత మార్కెట్లు కోలుకుంటున్నాయి. రిలయన్స్ స్టాక్ కూడా క్రమంగా ఎగిసింది. దీనికి పెట్టుబడులు తోడయ్యాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం స్టాక్ ధర (రూ.1,876) మార్చి ఆల్ టైమ్ కనిష్టం కంటే 116 శాతం అధికం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications