For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100 బిలియన్ డాలర్ల దిశగా ముఖేష్ అంబానీ, ఒక్కరోజులో 3.7 బిలియన్ డాలర్లు

|

ముంబై: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా ఎగిసిపడింది. శుక్రవారం రిలయన్స్ స్టాక్ ఓ సమయంలో ఏకంగా నాలుగు శాతం లాభపడింది. దీంతో ముఖేష్ సంపద ఆ సెషన్‌లో 3.7 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే ఆయన నికర సంపద కూడా 92.60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే 100 బిలియన్ డాలర్ల డాలర్ల దిశగా దుసుకెళ్తున్నారు. బ్లూమ్‍‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ టాప్ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ నికర సంపద 102.6 బిలియన్ డాలర్లు కాగా, ముఖేష్ నికర సంపద ఆయన కంటే కేవలం 10 బిలియన్ డాలర్లు మాత్రమే తక్కువగా ఉంది. ఎల్-ఓరియల్స్ ఫ్రాంకోయిస్ బెట్టెన్‌కోర్ట్ మేయర్స్(సంపద 92.9 బిలియన్ డాలర్లు)కు సమీపంలో ఉన్నారు.

రిలయన్స్ జంప్...

రిలయన్స్ జంప్...

చీపర్ గ్రీన్ హైడ్రోజెన్ ఉత్పత్తిని రెండింతలు పెంచుతామని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించడం సహా వివిధ అంశాలు కలిసి వచ్చి గత శుక్రవారం రిలయన్స్ స్టాక్ 4.15 శాతం లాభపడి లాభపడింది. భారత టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో ముందు ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఆర్పు రూ.200కు పెంచుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ జియో ఆర్పు రూ.160 నుండి రూ.170గా అంచనా వేస్తున్నారు. ఇది కూడా రిలయన్స్ స్టాక్ దూకుడుకు కలిసి వచ్చింది. భారత మార్కెట్‌లో డిజిటల్ స్పేస్‌లో ముఖేష్ అంబానీ దూసుకెళ్తున్నారు. ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజాలతో జతకట్టిన రిలయన్స్ డిజిటల్ స్పేస్‌లో క్రమంగా మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఇక రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపారంలో సౌదీ ఆరామ్‌కో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. ఈ డీల్ వ్యాల్యూ 25 బిలియన్ డాలర్లు. ఆయిల్ టు కెమికల్స్, టెలికం టు డిజిటల్.. ఇలా రిలయన్స్ అన్నింటా దూసుకెళ్లటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడుతోంది.

కంపెనీ మార్కెట్ క్యాప్...

కంపెనీ మార్కెట్ క్యాప్...

వివిధ అంశాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ధర శుక్రవారం భారీగా లాభపడింది. క్రితం సెషన్లో 4.15 శాతం లేదా రూ.95.25 ఎగిసి రూ.2,389.65కు చేరుకుంది. అంతకుముందు రోజు రూ.2,294 వద్ద క్లోజ్ అయింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1514017.50 కోట్లకు చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1420935.10 కోట్లుగా ఉంది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్‌ను అత్యంత చౌకగా కేజీకి 1 డాలర్ ధర లోపు అందిస్తామని ప్రకటించారు. రిలయన్స్ ఈ పెట్టుబడి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన క్లైమేట్ చేంజ్ ఆంబిషన్‌కు అనుగుణంగా ఉంది.

ప్రపంచ కుబేరులు

ప్రపంచ కుబేరులు

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానంలో ఉన్నారు. అమెజాన్ డాట్ కామ్ అధినేత జెఫ్ బెజోస్ ఈ జాబితాలో 201 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. టెస్లా ఇంక్ ఎలాన్ మస్క్ 199 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.

ఎవరి సంపద ఎంత అంటే?

- జెఫ్ బెజోస్ - 200.7 బిలియన్ డాలర్లు

- ఎలాన్ మస్క్ - 198.9 బిలియన్ డాలర్లు

- బెర్నార్డ్ అర్నాల్ట్ - 163.6 బిలియన్ డాలర్లు

- బిల్ గేట్స్ - 153.6 బిలియన్ డాలర్లు

- మార్క్ జుకర్‌బర్గ్ - 139.8 బిలియన్ డాలర్లు

- లారీ పేజ్ - 128.1 బిలియన్ డాలర్లు

- సెర్జీ బిన్ - 123.6 బిలియన్ డాలర్లు

- స్టీవ్ బాల్మర్ - 107.6 బిలియన్ డాలర్లు

- లారీ ఎలిషన్ - 103.8 బిలియన్ డాలర్లు

- వారెన్ బఫెట్ - 102.6 బిలియన్ డాలర్లు

- ఫ్రాంకోయిస్ బెట్టెన‌కౌంట్ మేయెర్స్ - 92.9 బిలియన్ డాలర్లు

- ముఖేష్ అంబానీ - 9269 బిలియన్ డాలర్లు

English summary

100 బిలియన్ డాలర్ల దిశగా ముఖేష్ అంబానీ, ఒక్కరోజులో 3.7 బిలియన్ డాలర్లు | Mukesh Ambani's net worth inches closer to $100 billion, $3.7 billion in one day

RIL chairman Mukesh Ambani's net worth grew $3.7 billion as RIL share price skyrocketed more than 4 per cent on Friday trade session.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X