For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!

|

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాటు వేసింది. ఈ వైరస్ బారిన పడి లక్షలాది మంది మృతి చెందారు. కోట్లాది మంది వేతనాల కోత లేదా ఉద్యోగాల కోత ఎదుర్కొని, ఆర్థికంగా చితికి పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ చాలామంది కుబేరుల ఆస్తులు పెరిగాయి. ఇందులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేష్ అంబానీయే కాదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏకంగా ప్రపంచ నెంబర్ వన్‌గా ఎదిగారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద కూడా కనీవినీ ఎరుగని విధంగా పెరిగింది. ఇలా చాలామంది వరుసలో ఉన్నారు.

Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'

సాధారణ వ్యక్తికి 10,000 సంవత్సరాలు

సాధారణ వ్యక్తికి 10,000 సంవత్సరాలు

కరోనా సమయంలో భారీగా సంపాదించిన వారిలో మన దేశంలో ముఖేష్ అంబానీ ముందున్నారు. ఈ కాలంలో ప్రతి గంటలో ముఖేష్‌కు వచ్చిన ఆదాయం ఓ సాధారణ వ్యక్తి సంపాదించాలంటే కనీసం 10,000 సంవత్సరాల వరకు పడుతుందని అంచనా. అలాగే, ఒక సెకనుకు ముఖేష్ సంపాదన సాధారణ వ్యక్తికి మూడేళ్ల వరకు పడుతుంది.

ఆక్స్‌ఫామ్ ఇన్-ఈక్వాలిటీ నివేదిక ప్రకారం కరోనా సమయంలో ముఖేష్ సంపాదన భారీగా ఎగిసింది. ఈ మేరకు ఆక్స్‌ఫామ్ ఇన్-ఈక్వాలిటీ 'ది ఇన్-ఈక్వాలిటీ వైరస్ రిపోర్ట్'లో తెలిపింది. కరోనా సమయంలో సామాజిక, ఆర్థిక, జెండర్ ఇన్-ఈక్వాలిటీ కూడా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

ముఖేష్ ఆదాయం గంటకు రూ.90 కోట్లు

ముఖేష్ ఆదాయం గంటకు రూ.90 కోట్లు

కరోనా సమయంలో ముఖేష్ అంబానీ గంటకు రూ.90 కోట్లు ఆర్జించారు. ముఖేష్ అంబానీదే కాదు, ప్రపంచ, భారత కుబేరుల సంపద ఈ కాలంలో ఎగిసిపడింది. భారత కుబేరుల ఆదాయం ఈ కాలంలో 35 శాతం పెరిగింది. 2009 నుండి తీసుకుంటే 90 శాతం పెరిగి 422.9 బిలియన్ డాలర్లుగా ఉంది. బిలియనీర్స్ ర్యాంకింగ్‌లో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ తర్వాత భారత్ ఆరో స్థానంలో ఉంది. కరోనా సమయంలో భారత టాప్ 11 మంది కుబేరుల వద్ద పెరిగిన సంపదతో MGNREGS స్కీంను సులభంగా నిర్వహించవచ్చు. హెల్త్ మినిస్ట్రీకి 10 ఏళ్ల పాటు ఇవ్వవచ్చు.

24 శాతం మంది ఆదాయం రూ.3వేల కంటే తక్కువ

24 శాతం మంది ఆదాయం రూ.3వేల కంటే తక్కువ

ముఖేష్ అంబానీ సంపద కరోనా కాలంలో 72 శాతం పెరిగింది. గంటకు రూ.90 కోట్లు ఆర్జించారు. అదే సమయంలో దేశంలో 24 శాతం మంది రూ.3000 కంటే తక్కువ ఆర్జించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం 90 శాతం మంది అసంఘటిత ఎకానమీలో ఉన్నారు. 40 కోట్ల మంది వరకు ఉంటారు. కరోనా సమయంలో నెలకు రూ.20వేలు సంపాదించే వారి ఆదాయం 37 శాతం పెరిగింది.

English summary

కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే! | Mukesh Ambani made Rs 90 crore per hour amid Corona while Many earned under 3K

The Covid pandemic has led to a rise in inequality, and it would take an unskilled worker 10,000 years to make what Ambani made in an hour during the pandemic and three years to make what Mukesh Ambani made in a second.
Story first published: Monday, January 25, 2021, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X