For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mukesh Ambani: అంబానీ సామ్రాజ్యంలోకి మరో కంపెనీ.. జర్మన్ కంపెనీ కోసం రూ.5,600 కోట్లతో బిడ్..!

|

Mukesh Ambani: దేశంలోనే రెండో అతిపెద్ద సంపన్నుడు ముఖేష్ అంబానీ మరో కంపెనీని హస్తగతం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా జర్మనీకి చెందిన కంపెనీని కొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దీనికి సంబంధించిన వార్తల నేపథ్యంలో స్టాక్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

భారీ మెుత్తం వెచ్చించి..

భారీ మెుత్తం వెచ్చించి..

రిటైల్ వ్యాపారంలో వేగంగా ముందుకు సాగుతున్న రిలయన్స గ్రూప్ గతంలో ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన స్టోర్లను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇదే క్రమంలో తాజాగా దేశంలో వ్యాపారం చేస్తున్న జర్మన్ కంపెనీ మెట్రో క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం కంపెనీ రూ.5,600 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. అయితే ఈ రేసులో ఉన్న థాయ్‌లాండ్‌లోని అతిపెద్ద కంపెనీ చారోన్ పోక్‌ఫాండ్ గ్రూప్ సుమారు రూ.8,000 కోట్లకు బిడ్ చేసింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత భారత్‌లో హోల్‌సేల్ వ్యాపారాన్ని మూసివేయడానికి మెట్రో సంస్థ ప్రయత్నిస్తోంది.

ఇది జర్మన్ కంపెనీ అంచనాలకు అనుగుణంగా ఉంది.

మెట్రో ఎందుకు వెళ్లిపోతోంది..

మెట్రో ఎందుకు వెళ్లిపోతోంది..

భారత్ లోని ప్రభుత్వ నియంత్రణ వాతావరణం, స్వదేశీ వర్సెస్ ఫారిన్‌పై జరుగుతున్న చర్చల గురించి మెట్రో ఇండియా మాతృ సంస్థ జర్మన్ కంపెనీ మెట్రో AG ఆందోళన చెందుతోంది. విదేశీ రిటైల్ కంపెనీలు ఎఫ్‌డిఐ నిబంధనలను ఉల్లంఘించాయని భారతీయ కంపెనీలకు సంబంధించిన లాబీ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను విదేశీ కంపెనీలు ఎప్పుడూ తోసిపుచ్చుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కంపెనీ తన నిర్ణయాన్ని వెలువరించింది.

కంపెనీ వ్యాల్యూయేషన్..

కంపెనీ వ్యాల్యూయేషన్..

మెట్రో క్యాష్ & క్యారీ మర్చంట్ బ్యాంకర్లైన JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్‌లు కంపెనీ వ్యాపార విలువను అంచనా వేశాయి. కంపెనీ వ్యాల్యూయేషన్ దేశంలో 1 బిలియన్ డారల్ల వరకు ఉంటుందని తెలిపాయి. దీని కోసం కంపెనీలు తుది బైండింగ్ బిడ్‌ను ఒక నెలలోపు సమర్పించవచ్చు. ఈ కాలంలో బిడ్ మొత్తాన్ని మార్చుకోవచ్చని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

దేశంలో కంపెనీ వ్యాపారం..

దేశంలో కంపెనీ వ్యాపారం..

మెట్రో క్యాష్ & క్యారీ ప్రస్తుతం దేశంలో 31 స్టోర్లను మెట్రో హోల్‌సేల్ బ్రాండ్‌తో నిర్వహిస్తోంది. మెట్రో AG 2003 సంవత్సరంలో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఇప్పుడు భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీకి దేశంలోని ప్రధాన నగారాలైన హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ముంబయి వంటి నగరాల్లో ఉన్నాయి. వీటిని సొంతం చేసుకోవటం ద్వారా వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని రిలయన్స్ రిటైల్ యోచిస్తోంది.

English summary

Mukesh Ambani: అంబానీ సామ్రాజ్యంలోకి మరో కంపెనీ.. జర్మన్ కంపెనీ కోసం రూ.5,600 కోట్లతో బిడ్..! | Mukesh Ambani eyeing on metro cash and carry business and bidding for 5600 crores

Mukesh Ambani eyeing on metro cash and carry business and bidding for 5600 crores
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X