For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Medanta IPO: అదరగొడుతున్న మేదాంతా ఐపీవో.. ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన షేర్లు.. ఇన్వెస్టర్ల భారీ స్పందన..

|

Medanta IPO:మేదాంతా బ్రాండ్‌తో ఆసుపత్రులను నడుపుతున్న గ్లోబల్ హెల్త్ కంపెనీ భారత స్టాక్ మార్కెట్లోకి ఐపీవో ద్వారా అడుగుపెడుతోంది. ఇందుకోసం నవంబర్ 3, 2022న పబ్లిక్ ఇష్యూ సైతం ప్రారంభించబడింది. దీనికి ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. మెుదటి రోజే షేర్ల కోసం పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపారు.

ఓవర్‌సబ్‌స్క్రైబ్..

ఓవర్‌సబ్‌స్క్రైబ్..

ఇష్యూ మెుదటిరోజే ఈ హాస్పిటల్ చైన్ ఐపీవో షేర్లు ఏకంగా 26 శాతం ఓవర్‌సబ్‌స్క్రిప్షన్‌తో మంచి స్పందనను అందుకుంది. ఈ ఇష్యూ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 7 వరకు తెరచి ఉంటుంది. ఇది మెుత్తం నవంబర్ 3, 2022న ప్రారంభమై నవంబర్ 7, 2022న ముగుస్తుంది. తాజా ఇష్యూ ద్వారా కంపెనీ రూ.500 కోట్లను సమీకరిస్తోంది. 5,07,61,000 ఈక్విటీ షేర్లు విక్రయానికి ఆఫర్ చేయబడుతోంది.

ఐపీవో వివరాలు..

ఐపీవో వివరాలు..

మేదాంతా ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.319-336గా నిర్ణయించబడింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.662 కోట్లు సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. అప్పర్ ప్రైజ్ బ్యాంక్ ధరకు షేర్ల విక్రయం జరిగితే ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం రూ.2,206 కోట్లను ఆర్జిస్తుందని తెలుస్తోంది. అయితే దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ రుణాల చెల్లింపుల కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. జియోజిత్, ఆషికా రీసెర్చ్ తో సహా అనేక బ్రోకరేజీలు స్టాక్‌పై "BUY" కాల్‌ ఇస్తున్నాయి.

బ్రోకరేజ్..

బ్రోకరేజ్..

నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటంలో కంపెనీ ఇప్పటికే మంచి పేరు పొందింది. దీనిలో భాగంగానే నోయిడాలో ఒక ఆసుపత్రిని నిర్మిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సంస్థకు గురుగ్రామ్‌, ఇండోర్‌, రాంచీ, లఖ్‌నవూ, పట్నాలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఛాయిస్ బ్రోకింగ్ సైతం కంపెనీకి BUY రేటింగ్ అందించింది. బలమైన బ్రాండ్ విలువ, దేశంలో ఆరోగ్య సంరక్షణ విభాగంలో కంపెనీ చొచ్చుకుపోయినందున.. వ్యాపార వృద్ధిని పరిగణలోకి తీసుకుని బ్రోకరేజ్ కంపెనీలు తమ రేటింగ్ అందించాయి.

English summary

Medanta IPO: అదరగొడుతున్న మేదాంతా ఐపీవో.. ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన షేర్లు.. ఇన్వెస్టర్ల భారీ స్పందన.. | Medanta IPO Shares Over Subscribed on 1st Day as many brokerages gave Buy call

Medanta IPO Shares Over Subscribed on 1st Day as many brokerages gave Buy call
Story first published: Friday, November 4, 2022, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X