For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ, అమెరికా ప్రభావం: భారీ నష్టాల తర్వాత.. జోరుమీద మార్కెట్లు

|

ముంబై: భారత మార్కెట్లు మంగళవారం (మార్చి 17) భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 298.17 (0.95 శాతం) పాయింట్ల నష్టంతో 31,091.90 వద్ద, నిఫ్టీ 73.40 (0.80%) పాయింట్ల నష్టంతో 9,124 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

434 షేర్లు నష్టాల్లో, 359 షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా 32 షేర్లలో మార్పు లేదు. నష్టాలతో ప్రారంభమైన స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, మహీంద్రా బ్యాంకు, యూపీఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.

గుడ్‌న్యూస్: నష్టాలతో నిలిచిన ట్రేడింగ్, నేడు భారీ లాభాల్లో మార్కెట్లుగుడ్‌న్యూస్: నష్టాలతో నిలిచిన ట్రేడింగ్, నేడు భారీ లాభాల్లో మార్కెట్లు

Market: Sensex near 500 points, YES Bank surges 30 percent

ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ 31,000 దిగువకు చేరుకొని, మళ్లీ కవర్ అయింది.
క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. 31వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ 500 పాయింట్ల లాభాల్లోకి వచ్చింది. నిఫ్టీ కూడా లాభాల్లోకి వచ్చింది. ఉదయం గం.10 సమయంలో టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, వేదాంతలు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్, కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో అమెరికా మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లకు ఉపకరించింది. దీంతో తొలుత నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఆర్బీఐ కూడా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే హింట్ ఇచ్చింది. ఇది కూడా కలిసి వచ్చింది.

English summary

ఆర్బీఐ, అమెరికా ప్రభావం: భారీ నష్టాల తర్వాత.. జోరుమీద మార్కెట్లు | Market: Sensex near 500 points, YES Bank surges 30 percent

Among sectors metal, pharma and FMCG witnessing buying interest, while selling seen in the bank, infra and IT stocks.
Story first published: Tuesday, March 17, 2020, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X