For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ రీబౌండ్: ఆటుపోట్ల నుండి హైజంప్, సెన్సెక్స్ 431 పాయింట్లు అప్

|

ముంబై: నిన్న భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు (గురువారం నవంబర్ 26) లాభాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో కదలాడి, నష్టాల్లోనే ఉన్నప్పటికీ, మధ్యాహ్నం గం.1 నుండి లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత మార్కెట్లు కిందకు పడిపోలేదు. అంతకంతకూ పెరిగి 400కు పైకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 431.64 పాయింట్లు(0.98%) లాభపడి 44,259.74 పాయింట్లకు, నిఫ్టీ 128.60 పాయింట్లు (1.00%) లాభపడి 12,987 పాయింట్లకు ఎగిసింది. 1726 షేర్లు లాభాల్లో, 986 షేర్లు నష్టాల్లో ముగియగా, 179 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

44వేల మార్కును తాకిన రిలయన్స్

44వేల మార్కును తాకిన రిలయన్స్

సెన్సెక్స్ మళ్లీ 44,000 మార్కును క్రాస్ చేసింది. అయితే నిఫ్టీ 13వేల పాయింట్లకు మరో 13 పాయింట్ల దూరంలో ముగిసింది.

దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.

నిఫ్టీ మిడ్ క్యాప్ 19,196 పాయింట్ల వద్ద ముగిసింది. 40 స్టాక్స్‌కు పైగా లాభాల్లో ముగిశాయి. సిమన్స్ స్టాక్ 10 నెలల గరిష్టాన్ని తాకింది.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 6.19 శాతం, టాటా స్టీల్ 5.02 శాతం, గ్రాసీమ్ 4.07 శాతం, హిండాల్కో 2.89 శాతం, శ్రీసిమెంట్స్ 2.88 శాతం లాభాల్లో ముగిశాయి.

ఐచర్ మోటార్స్ 1.77 శాతం, బీపీసీఎల్ 1.06 శాతం, మారుతీ సుజుకీ 0.87 శాతం, ఓఎన్జీసీ 0.74 శాతం, HDFC లైఫ్ 0.65 శాతం నష్టాల్లో ముగిశాయి.

రిలయన్స్ స్టాక్ ఈ రోజు 0.47 శాతం ఎగిసి రూ.1,957 వద్ద ముగిసింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ మిడ్ క్యాప్ 1.45 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.86 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.34 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.61 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.83 శాతం, నిఫ్టీ ఐటీ 0.71 శాతం, నిఫ్టీ మీడియా 0.59 శాతం, నిఫ్టీ మెటల్ 3.85 శాతం, నిఫ్టీ ఫార్మా 1.43 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.93 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.77 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.97 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.26 శాతం నష్టపోయింది.

అందుకే లాభాల్లోకి..

అందుకే లాభాల్లోకి..

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల అండతో నవంబర్ డెరివేటివ్ సిరీస్‌ను లాభాలతో ముగించాయి.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 1.06 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్ 2 శాతం, ఇన్ఫోసిస్ 0.21 శాతం, విప్రో 1.67 శాతం, మైండ్ ట్రీ 1.74 శాతం, కోఫోర్జ్ స్టాక్ 1.05 శాతం లాభపడింది. టెక్ మహీంద్రా స్టాక్ మాత్రం 0.49 శాతం నష్టపోయింది.

English summary

మార్కెట్ రీబౌండ్: ఆటుపోట్ల నుండి హైజంప్, సెన్సెక్స్ 431 పాయింట్లు అప్ | Market rebounds: Sensex jumps over 431 points, Nifty tests 13K

The market bounced back from the previous session's sell-off and ended near the day's high on November 26. The Nifty50 ended the November F&O series near 13,000, supported by metal and financial stocks.
Story first published: Thursday, November 26, 2020, 18:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X