For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ దూకుడు: ఆల్‌టైమ్ హైకి IRCTC షేర్లు

|

ముంబై: నాలుగు సెషన్‌లలో నష్టాలు చవిచూసిన మార్కెట్లు బుధవారం లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 309.82 (0.76%) పెరిగి 41204.20 వద్ద, నిఫ్టీ 92.70 (0.77%) పెరిగి 12085.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మధ్యాహ్నం గం.12.17 సమయానికి సెన్సెక్స్ 329.09 (0.80%) పాయింట్లు ఎగిసి 41,223.47 వద్ద, నిఫ్టీ 100.35 (0.84%) పాయింట్లు పెరిగి 12,092.85 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.3 సమయానికి సెన్సెక్స్ 404.01 (0.99%) పాయింట్లు పెరిగి 41,298.39 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 129.55 (1.08%) పాయింట్లు పెరిగి 12,122.05 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.39 వద్ద ట్రేడ్ అయింది.

ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, అల్ట్రా టెక్, రిలయన్స్, కొటక్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంకు, నెస్ట్లే, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఏషియన్ పేయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హిందూస్తాన్ యూనీ లీవర్, ఇన్ఫోసిస్, టైటాన్, ఐటీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్ అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Market: IRCTC surges 7 percent, Sensex jumps 400 points, Nifty above 12,100

టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్, వేదాంత ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్ ఫార్మా ఉన్నాయి. IRCTC షేర్లు ఏడు శాతం పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. షేర్ ధర రూ.1,752.85కు పెరిగింది.

ఎన్ఎస్ఈలో దాదాపు 35 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి పెరిగాయి. గరిష్టస్థాయికి చేరుకున్న షేర్లలో అబోట్ ఇండియా, ఏజీసీ నెట్ వర్క్స్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్, దీపక్ నైట్రేట్, ఎస్కార్ట్స్, ఐనోక్స్ లీజర్, గ్రాన్యువల్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.

English summary

లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ దూకుడు: ఆల్‌టైమ్ హైకి IRCTC షేర్లు | Market: IRCTC surges 7 percent, Sensex jumps 400 points, Nifty above 12,100

IRCTC surges 7%, logs a new all time high. Around 35 stocks rose to touch their 52-week highs on NSE in Wednesday's session.
Story first published: Wednesday, February 19, 2020, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X