For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీకి, రియాల్టీ, HDFC తోడు.. ఆరంభ లాభాలు ఆవిరి: లాభాల స్వీకరణకు మొగ్గు

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 20) లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ ఓ దశలో 400 పాయింట్ల లాభాలను చూసింది. చివరకు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 300 పాయింట్ల లాభాలు ఎగిరిపోయాయి. సెన్సెక్స్ 112.77 పాయింట్లు(0.28%) లాభపడి 40,544.37 వద్ద, నిఫ్టీ 23.80 పాయింట్లు(0.20%) లాభపడి 11,896.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1,344 షేర్లు లాభాల్లో, 1,299 షేర్లు నష్టాల్లో ముగియగా, 157 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

అవసరమైతే మరోసారి.. లేదనడం లేదు: ప్యాకేజీపై నిర్మల సీతారామన్ సంకేతాలుఅవసరమైతే మరోసారి.. లేదనడం లేదు: ప్యాకేజీపై నిర్మల సీతారామన్ సంకేతాలు

లాభాల స్వీకరణకు మొగ్గు..

లాభాల స్వీకరణకు మొగ్గు..

గత రెండు సెషన్‌లలో మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

గురువారం భారీ నష్టాల అనంతరం మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో లాభాలు చూశాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీ స్టాక్స్ నిఫ్టీ భారీ లాభాలకు కారణమయ్యాయి.

నిఫ్టీ బ్యాంకు 45 పాయింట్లు లాభపడి 24,312 వద్ద, మిడ్ క్యాప్ సూచీ 107 పాయింట్లు ఎగిసి 17,023 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ టాప్ లూజర్స్‌లో బ్రిటానియా ఉంది. హెచ్‌యూఎల్ స్వల్ప నష్టాల్లో ముగిసింది.

నిన్నటి పీఎస్‌యూ బ్యాంకుల లాభాలు హరించుకుపోయాయి.

ఓఎన్జీసీ, గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

రేపు ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ ఒత్తిడికి లోనయింది.

హిందూస్తాన్ కాపర్ 11 శాతం లాభపడింది.

ఏసీసీ సిమెంట్స్ మంచి ఫలితాలు ప్రకటించడంతో సిమెంట్ స్టాక్స్ ర్యాలీ చేశాయి.

జస్ట్ డయల్ షేర్ 19 శాతం ఎగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిలిచాయి.

టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా, ఓఎన్జీసీ, ఐవోసీ, గెయిల్, యూపీఎల్ నిలిచాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, లార్సన్ ఉన్నాయి.

ఎఫ్ అండ్ వో కౌంటర్లలో ఐడియా 10 శాతం దూసుకెళ్లింది.

డాలర్ మారకంతో రూపాయి 73.46 వద్ద ట్రేడ్ అయింది.

ఐటీ, ఫార్మా, ఆటో రంగాల షేర్లు లాభపడగా, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి.

ఐటీ, రియాల్టీ అదుర్స్

ఐటీ, రియాల్టీ అదుర్స్

ఐటీ షేర్లు భారీగా లాభపడ్డాయి. టీసీఎస్ 1.01 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.29 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 0.89 శాతం, టెక్ మహీంద్ర 3.17 శాతం, విప్రో షేర్ 1.11 శాతం, మైండ్ టరీ షేర్ 5.79 శాతం, కోఫోర్జ్ షేర్ 1.23 శాతం లాభపడ్డాయి.

మార్కెట్ ర్యాలీకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీ స్టాక్స్ దోహదపడ్డాయి.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లలో 15 లాభాల్లో ముగిశాయి.

రంగాలవారీగా రియాల్టీ 3.77 శాతం లాభపడగా, ఆయిల్ అండ్ గ్యాస్ బిగ్గెస్ట్ లూజర్ (1.30 శాతం)గా నిలిచింది.

English summary

ఐటీకి, రియాల్టీ, HDFC తోడు.. ఆరంభ లాభాలు ఆవిరి: లాభాల స్వీకరణకు మొగ్గు | Market ends with gains, Nifty holds 11,900 level

At close, the Sensex was up 112.77 points or 0.28% at 40544.37, and the Nifty was up 23.80 points or 0.20% at 11896.80. About 1344 shares have advanced, 1299 shares declined, and 157 shares are unchanged.
Story first published: Tuesday, October 20, 2020, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X