For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు 30 లక్షల షేర్లు ఉన్న కంపెనీ: తక్కువ పెట్టుబడితో

|

ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. స్టార్ స్టాక్ ఇన్వెస్టర్. దేశీయ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ గురించి చర్చించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను ఓ బెంచ్ మార్క్‌గా తీసుకుని.. షేర్లల్లో ఇన్వెస్ట్ చేసే వారూ లేకపోలేదు. ఆయన కొనుగోలు చేసిన షేర్లల్లో తాము కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఖచ్చితంగా అంచనా వేయగలరనే పేరుందాయనకు.

30 లక్షల షేర్లు

30 లక్షల షేర్లు

అలాంటి రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో 30 లక్షల షేర్లు ఉన్నాయి. మ్యాన్ ఇన్‌ఫ్రాకు చెందిన 30 లక్షల షేర్లను ఆయన కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ కంపెనీ ఇష్యూ చేసిన షేర్లల్లో రాకేష్‌కు ఉన్న వాటా 1.21 శాతం. మ్యాన్ ఇన్‌ఫ్రా షేర్లు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయదగ్గవిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతుంటారు. శుక్రవారం సాయంత్రం బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లల్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒక్కో షేరు విలువ రూ.110.30 పైసలుగా రికార్డయింది.

రూ.290 వరకు

రూ.290 వరకు

మున్ముందు ఈ షేర్ ధర ఒక్కింటికి 200 రూపాయలు, 290 రూపాయలకు వెళ్తుందానే అంచనాలు ఉన్నాయి. గరిష్ఠంగా 430 రూపాయలను టచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. మ్యాన్ ఇన్‌ఫ్రా స్టాప్ లాస్ వ్యాల్యూ 55 రూపాయలు. దీని

మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.700 కోట్ల రూపాయలు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెద్ద ఎత్తున షేర్లను కొనుగోలు చేసి, వాటిని హోల్డ్‌లో ఉంచినందున అందరి దృష్టీ దీని మీద నిలిచింది.

25 రూపాయల పెట్టుబడితో..

25 రూపాయల పెట్టుబడితో..

గత ఏడాది అక్టోబర్‌లో ఒక్కో షేర్‌పై 25 రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. 30 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీని ధర ఇప్పుడు 110.30 పైసలకు చేరింది. టాప్ కార్ మేకర్ మారుతీ షేర్లు కూడా అప్పర్ సర్క్యుట్‌లోనే ముగిశాయి. రూ.7,498.15 పైసల వద్ద ట్రేడ్ అయింది దీని షేర్. దీన్ని కొనాలనుకునే వారు ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో షేర్ ధర 7,700 రూపాయలకు చేరిన తరువాతే కొనాలనే సలహా ఇస్తున్నారు.

 మారుతి షేర్లలో భారీ జంప్‌కు ఛాన్స్

మారుతి షేర్లలో భారీ జంప్‌కు ఛాన్స్

మారుతి షేర్ల ధర మున్ముందు 9,920,12,500, 16,500 రూపాయలకు వెళ్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని స్టాప్ లాస్ వ్యాల్యూ 4.900 రూపాయలు. ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్- స్మాల్ క్యాప్‌లో 21 సంవత్సరాలుగా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.145.55 పైసలుగా రికార్డయింది. 155 రూపాయలు దాటిన తరువాతే దీన్ని కొనుగోలు చేయాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. దీని స్టాప్ లాస్ 100 రూపాయలు. క్రమంగా ఇది 290, 390 రూపాయలకు వెళ్తుందనే అంచనాలు ఉన్నాయి.

జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్స్..

జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్స్..

జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ షేర్లు కూడా దీర్ఘకాలానికి ఉపయోగపడేవేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 172 రూపాయల వద్ద ట్రేడ్ అయింది ఈ కంపెనీ షేర్ వేల్యూ. వెంటనే దీన్ని కొనుగోలు చేయవచ్చని, అప్పర్ సర్క్యుట్‌లో రికార్డవుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,500 కోట్ల రూపాయలు కాగా.. స్టాప్ లాస్ 100 రూపాయలు ఉంటోంది. ఈ షేర్ టార్గెట్ 283, 396, 576 రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు.

English summary

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు 30 లక్షల షేర్లు ఉన్న కంపెనీ: తక్కువ పెట్టుబడితో | Man Infra: This Rakesh Jhunjhunwala portfolio stock has given multibagger returns

Shares of Man Infra construction have given multibagger returns this year so far as the construction engineering company's stock has surged more than 220% in 2021.
Story first published: Saturday, October 16, 2021, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X