Gas booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే.. నిమిషాల్లో పని పూర్తవుతుంది!

ప్రస్తుతం వంట గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలు సామాన్యులను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే గ్యాస్ కొరత ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం బుకింగ్ విధానాల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వీటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో గ్యాస్ రీఫిల్ కోసం కనీసం 21 రోజులు వేచి ఉండాల్సి రాగా.. ఇప్పుడు ఆ కాలాన్ని 25 రోజులకు పెంచింది. అంటే ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో దాని కోసం 25 రోజులు ఆగాల్సి ఉంటుంది. అయితే మీ గ్యాస్ బుకింగ్ (gas booking) ప్రక్రియ మరింత ఈజీగా ఉండాలంటే ఈ 4 మార్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు.

lpg gas booking four quick and easy ways to book cylinder refill in india 2026

1. వాట్సాప్ (WhatsApp) ద్వారా బుకింగ్

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మనం రోజూ వాడే వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి కింద పేర్కొన్న నంబర్లకు మెసేజ్ చేస్తే సరిపోతుంది..

  • ఇండేన్ (Indane): 7588888824 నంబర్‌కు "REFILL" అని మెసేజ్ పంపండి.
  • భారత్ గ్యాస్ (Bharat Gas): 1800224344 నంబర్‌కు "Hi" అని మెసేజ్ చేయండి.
  • హెచ్‌పీ గ్యాస్ (HP Gas): 9222201122 నంబర్‌కు "Hi" అని పంపండి.

ఇలా వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మెసేజ్ పంపిన వెంటనే మీ బుకింగ్ పూర్తవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.

2. మిస్డ్ కాల్ (Missed Call) పద్ధతి

మీ దగ్గర ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. మీ గ్యాస్ ప్రొవైడర్ నంబర్‌కు మీ రిజిస్టర్డ్ ఫోన్ నుండి కాల్ చేస్తే చాలు:

  • ఇండేన్ (Indane): 8454955555
  • భారత్ గ్యాస్ (Bharat Gas): 7710955555
  • హెచ్‌పీ గ్యాస్ (HP Gas): 9493602222

ఈ విధానం ముఖ్యంగా నెట్‌వర్క్ సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

3. మొబైల్ యాప్స్ , వెబ్‌సైట్లు

మనం నిత్యం వాడే పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe) వంటి యాప్స్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో 'రీఛార్జ్ & పే బిల్స్' సెక్షన్‌కు వెళ్లి, 'బుక్ ఏ సిలిండర్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కస్టమర్ ఐడి లేదా మొబైల్ నంబర్ ఇస్తే బుకింగ్ పూర్తవుతుంది. వీటితో పాటు ఇండియన్ ఆయిల్ వన్, హలో హెచ్‌పి వంటి అధికారిక యాప్స్ కూడా వాడుకోవచ్చు.

4. IVRS కాల్ ద్వారా

ఇక వీటితోపాటు కాల్ చేసి ఆటోమేటెడ్ వాయిస్ సూచనల ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. ఉదాహరణకు ఇండేన్ కస్టమర్లు 7718955555 కు కాల్ చేసి సూచనలు పాటిస్తే సరిపోతుంది. బుకింగ్ సమయంలో మీ 16 అంకెల ఎల్‌పిజి ఐడి (LPG ID), డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు.

మొత్తంగా చూస్తే గ్యాస్ బుకింగ్ ప్రక్రియను కంపెనీలు ఇప్పుడు చాలా సులభతరం చేశాయి. పైన పేర్కొన్న పద్ధతుల్లో మీకు నచ్చిన దానిని ఎంచుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ రీఫిల్ పొందవచ్చు. నిబంధనలు మారుతున్నా సరైన అవగాహన ఉంటే సకాలంలో సిలిండర్ పొందడం పెద్ద కష్టమేమీ కాదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+