For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త పాలసీలు జంప్, 21% వృద్ధి సాధించిన కొత్త బిజినెస్ ప్రీమియం

|

లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీల వ్యాపారం ఫిబ్రవరి నెలలో 21 శాతం పెరిగింది.త ఇన్సురెన్స్ రెగ్యులేటర్ Irdai ప్రకారం తొలి ప్రీమియం వసూళ్లు ఇరవై ఒక్క శాతం పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరుకున్నాయి. 2020 ఫిబ్రవరి నెలలో ఈ వసూళ్లు రూ.18,533.19 కోట్లగా నమోదయ్యాయి. 24 లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలకు కలిసి తొలి ప్రీమియం 21 శాతం పెరిగాయి. ఈ వాటాలో ప్రభుత్వరంగ LIC వాటానే అధికంగా ఉంది. ఎల్ఐసీ తొలి ప్రీమియం వసూళ్లు రూ.12,920.57 కోట్లుగా ఉంది.

నిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గిన ధరలు: రూ.45,000 దిగువకు పసిడినిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గిన ధరలు: రూ.45,000 దిగువకు పసిడి

16 శాతం అధికం

16 శాతం అధికం

2020 ఇదే నెల ప్రీమియం రూ.10,404.68 కోట్లతో పోలిస్తే 24.18 శాతం వృద్ధి సాధించింది. మిగతా 23 బీమా సంస్థలు కలిసి రూ.9,504.64 కోట్లు వసూలు చేశాయి. 2020 ఫిబ్రవరిలో ఈ కంపెనీలన్నీ కలిపి వసూలు చేసిన రూ.8,128.51 కోట్లతో పోలిస్తే ఇది 16.93 శాతం అధికం. HDFC లైఫ్ రూ.1,895.94 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.1,750.73 కోట్లు వసూలు చేశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 19 శాతం క్షీణించి రూ.1,737.03 కోట్లకు పరిమితమైంది.

వసూళ్లు ఇలా

వసూళ్లు ఇలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా లాక్‌డౌన్ వల్ల జీవిత బీమా తొలి ప్రీమియం వసూళ్లు 18.5 శాతం క్షీణించాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత వృద్ధి నమోదయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు పాలసీల విక్రయానికి పోటీ పడుతున్నాయి. దీంతో ప్రీమియం వసూళ్లు పెరిగాయి. ఇంత పోటీ వాతావరణంలోను FY20తో ఏప్రిల్-ఫిబ్రవరితో పోలిస్తే FY21లో అదే కాలంలో తొలి ప్రీమియం వసూళ్లు 0.6 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. ఇందుకు కరోనా లాక్ డౌన్ కారణం.

షేర్లు జంప్

షేర్లు జంప్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.34 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ప్రయివేటు బీమా సంస్థలన్ని కలిపి 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. LIC మూడు శాతం తక్కువ వృద్ధితో ఉంది. ప్రీమియం వసూళ్లు పెరిగిన నేపథ్యంలో ఇన్సురెన్స్ కంపెనీల స్టాక్స్ జంప్ చేశాయి.

English summary

కొత్త పాలసీలు జంప్, 21% వృద్ధి సాధించిన కొత్త బిజినెస్ ప్రీమియం | Life insurance companies see 21 per cent rise in new business premium

Life insurance companies registered a 21 per cent rise in new business premium to Rs 22,425.21 crore in February 2021, according to data from insurance regulator IRDAI.
Story first published: Wednesday, March 10, 2021, 17:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X