For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయివేటు సంస్థలకు ఇబ్బంది కలగకుండా.. రెండు దశల్లో LIC ఐపీవో

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో ఐపీవోకు రానుంది. కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వీటిలో ఎల్ఐసీ ఐపీవో కీలకం. ఎల్ఐసీ వ్యాల్యూ రూ.12 లక్షల కోట్ల నుండి రూ.15 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో పది శాతం వాటాను విక్రయించేందుకు షేర్లను జారీ చేస్తే రూ.1.2 లక్షల నుండి రూ.1.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి సమీకరిస్తే పబ్లిక్ ఇష్యూకు రావాలనుకున్న ఇతర ప్రయివేటు సంస్థలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు.

ఎల్ఐసీఐపై ఎంతో ఆసక్తి

ఎల్ఐసీఐపై ఎంతో ఆసక్తి

ఇటీవల ఐపీవోకు వచ్చిన జొమాటోకు మంచి స్పందన వచ్చింది. జొమాటో రూ.9373 కోట్ల ఐపీవోకు వచ్చింది. దీనికి నలభై రెట్లకు పైగా స్పందన వచ్చింది. పేటీఎం, పాలసీబజార్, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటి సంస్థలు ఐపీవోకు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసీ ఐపీవోకు వస్తే మంచి స్పందన ఉంటుంది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఎల్ఐసీ పైన చాలా ఆసక్తితో ఉన్నారు. ప్రజల్లో ఎల్ఐసీ పైన విశ్వాసం ఎక్కువ. ఐపీవోకి దరఖాస్తు చేయడం కోసం మార్కెట్లో ఇతర కంపెనీల షేర్లలోని డబ్బుని వెనక్కి తీసుకొని, ఎల్ఐసీ ఇష్యూకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

అందుకే రెండు పర్యాయాలు

అందుకే రెండు పర్యాయాలు

అందుకే కొత్తగా ఐపీఓకి రావాలనుకునే సంస్థలకు ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని చిన్నసంస్థల షేర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని నివారించేందుకు తొలుత ఎల్ఐసీలో 5 శాతం నుండి 6 శాతం వాటాను మాత్రమే మార్కెట్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో దశ ఐపీవోకు అంటే ఫాలో-ఆన్‌కు రావడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చునని అంటున్నారు.

అనుకూలంగా నిబంధనలు

అనుకూలంగా నిబంధనలు

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పార్లమెంటులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓ పూర్తవుతుందని తెలిపారు. అందుకే ఎల్ఐసీని లిస్ట్ చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. సెబీ ఇటీవలే జారీ చేసిన నిబంధనల ప్రకారం రూ.లక్ష కోట్ల వ్యాల్యూకు మించిన కంపెనీలు రెండేళ్లలో 10 శాతం మేరకు, ఆ తర్వాత అయిదేళ్లలో 25 శాతం వరకు స్టాక్ మార్కెట్‌లో షేర్లను జారీ చేయాలి. ఈ నిబంధనలు ఎల్ఐసీకి అనుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు.

English summary

ప్రయివేటు సంస్థలకు ఇబ్బంది కలగకుండా.. రెండు దశల్లో LIC ఐపీవో | LIC stake to sell in two stages, Know the details

The government may not initially sell a 10% stake in LIC through an IPO, choosing instead to sell 5-6%, followed by a similar second public offering, given the mammoth size of the state-run insurer, four people aware of the development said.
Story first published: Sunday, July 25, 2021, 14:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X