For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LVB crisis: మారటోరియం దెబ్బకు 5 రోజుల్లో సగం పతనం, షేర్లు 48% డౌన్

|

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని, మారటోరియంపై ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) స్టాక్స గత ఐదు రోజులుగా కుప్పకూలుతున్నాయి. ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంకు ఇండియాలో విలీనం చేసేందుకు ఆర్బీఐ పథకం ప్రకటించింది. దీంతో ఆ బ్యాంకు షేర్లపై తీవ్ర ప్రభావం పడింది. వరుసగా ఐదో రోజు నష్టాల్లో ట్రేడ్ అయింది. డీబీఎస్‌లో విలీనం, మారటోరియం వంటి కారణాలతో స్టాక్ ఎక్స్చేంజీలో బ్యాంకు షేరు 5 రోజుల్లో దాదాపు సగం పడిపోయింది. మారటోరియం తర్వాత వరుసగా రెండు రోజులు ఏకంగా 20 శాతం చొప్పున మొత్తం 40 శాతం క్షీణించింది. మొత్తం ఐదు సెషన్లలో 48.24 శాతం పతనమైంది.

LVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలాLVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలా

సగం పడిపోయిన LVB స్టాక్

సగం పడిపోయిన LVB స్టాక్

గతవారం మారటోరియం ప్రకటనకు ముందు రూ.15.60 వద్ద ముగిసిన షేరు, ఆ తర్వాత రూ.12.45కు, రూ.10కి పడిపోయి శుక్రవారం నాటికి రూ.10 వద్ద ముగిసింది. ఈ రోజు మరో 10 శాతం పతనమైన లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్ రూ.8.10 వద్ద ట్రేడ్ అయింది. మొత్తంగా ఐదు సెషన్లలో 48 శాతానికి పైగా పడిపోయింది. మారటోరియంకు ముందు రూ.15కు పైగా ఉన్న స్టాక్ ఇప్పుడు రూ.8కి పడిపోయింది.

డీబీఎస్ బ్యాంకులో LVB విలీనంకు సంబంధించి ఆర్బీఐ ఫైనల్ మెర్జర్ స్కీంను ప్రకటించలేదు. వచ్చే వారం అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈ ఏడాది రెండో బ్యాంకు

ఈ ఏడాది రెండో బ్యాంకు

ఈ ఏడాదిలో ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న రెండో ప్రయివేటు బ్యాంకు LVB. ఆర్థిక ఇబ్బందులతో యస్ బ్యాంకుపై మార్చిలో మారటోరియం విధించారు. ఆర్బీఐ సూచనతో ఎస్బీఐ ఈ బ్యాంకుకు రూ.7,250 కోట్లు సమకూర్చి సంక్షోభం నుంచి గట్టెక్కించింది. 2004లో ఆర్థికంగా దివాలా తీసిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును కూడా ఆర్బీఐ తన ఆధీనంలోకి తీసుకొని ఆ తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేసింది.

విలీనంపై ఆందోళన

విలీనంపై ఆందోళన

డీబీఎస్‌లో LVB విలీనప్రతిపాదనపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. విలీనానికి సంబంధించి ఆర్బీఐ నిర్ణయించిన ఫార్ములా సరికాదంటున్నారు. LVB చెల్లింపు మూలధనాన్ని (పెయిడప్ క్యాపిటల్) పూర్తిగా రద్దు చేసి, DBS బ్యాంకులో విలీనం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే LVB షేర్లు ఉన్న ఇన్వెస్టర్లకు ఏమీరాదు. దీంతో ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని బ్యాంకు ప్రమోటర్లతో పాటు, LVB షేర్లు ఉన్న రిటైల్, సంస్థాగత మదుపరులు యోచిస్తున్నారు. అలాగే, LVBని డీబీఎస్‌కు బదులు ఏదేని ప్రభుత్వరంగ బ్యాంకులో విలీనం చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది.

English summary

LVB crisis: మారటోరియం దెబ్బకు 5 రోజుల్లో సగం పతనం, షేర్లు 48% డౌన్ | Lakshmi Vilas Bank tumbles to all time low, erodes 48 percent over 5 sessions

Lakshmi Vilas Bank continued to erode value, and fell another 10 per cent to hit an all-time low on Monday, reeling under pressure as investors stand to lose heavily under the Reserve Bank of India’s amalgamation scheme of the bank with Singapore’s DBS Bank.
Story first published: Monday, November 23, 2020, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X