For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8.5 శాతం వడ్డీకి ఆర్థికశాఖ ఓకే

|

ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక! కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (PF) వడ్డీకి సంబంధించి శుభవార్తను చెప్పింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాపై 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ అంగీకరించిందని సీనియర్ అధికారులు తెలిపారు. 'ఆరు కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ చొప్పున జమ చేసేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది' అని తెలిపారు.

రిలయన్స్ ఎఫెక్ట్, ముఖేష్ అంబానీని దాటేసిన చైనీస్ కుబేరుడు జోంగ్ షంషాన్‌రిలయన్స్ ఎఫెక్ట్, ముఖేష్ అంబానీని దాటేసిన చైనీస్ కుబేరుడు జోంగ్ షంషాన్‌

గెజిట్ తర్వాత..

గెజిట్ తర్వాత..

ఆర్థికమంత్రిత్వ శాఖ అంగీకారం పొందిన అనంతరం ఈపీఎప్ పైన వడ్డీ రేటును కార్మిక మంత్రిత్వ శాఖ సంతోష్ గాంగ్వార్ గురువారం నోటిఫికేషన్ అధికారికంగా ఆమోదించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం గెజిట్‌లో వడ్డీ రేటును అధికారికంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం ఈపీఎఫ్ పైన రాబడి రేటును చందాదారుల ఖాతాల్లో జమ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తుంది.

రెండు విడతలుగా..

రెండు విడతలుగా..

ఈ ఏడాది మార్చి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అఫెక్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీరేటు ఇవ్వడానికి ఆమోదించింది. సెప్టెంబర్ నెలలో 8.5 శాతం వడ్డీని రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతంగా విభజించాలని నిర్ణయించింది. అయితే 8.5 శాతం మొత్తాన్ని ఒకేసారి జమ చేయాలని ఆ తర్వాత నిర్ణయించింది.

త్వరలో వడ్డీ రాబడి

త్వరలో వడ్డీ రాబడి

రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ రేటును డిసెంబర్ చివరి నాటికి ఒకేసారి 6 కోట్ల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లో జమ చేసే అవకాశముందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఈ రోజు లేదా త్వరలో విడుదల చేసే అవకాశముంది.

English summary

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8.5 శాతం వడ్డీకి ఆర్థికశాఖ ఓకే | Labour Ministry decides to notify 8.5 percent interest on EPF for 2019-20

The Labour Ministry has decided to notify 8.5% rate of interest on employees' provident fund (EPF) accounts for 2019-20 after receiving the finance ministry's concurrence, Press Trust of India reported, citing a senior official said.
Story first published: Thursday, December 31, 2020, 18:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X