Tata Stocks: అదరగొడుతున్న టాటా స్టాక్స్.. దూసుకెళ్తున్న ఈ 5 షేర్లలో మీరు ఇన్వెస్ట్ చేశారా..?
Tata Stocks: దేశంలో టాటా గ్రూప్ అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. సాధారణంగా మార్కెట్లో ఉన్న ఒక నానుడి ఏమిటంటే.. ఏదైనా టాటా స్టాక్ కొంటే చాలు అది దీర్ఘకాలంలో తప్పకుండా మంచి రాబడులను అందిస్తుందని అంటారు.

కేవలం ఆరు నెలల్లో..
గత 6 నెలల కాలంలో స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులను చూస్తున్నాయి. కానీ.. ఈ కాలంలో టాటా గ్రూప్‌లోని కొన్ని షేర్లు మాత్రం అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. కష్ట సమయాల్లో కూడా పెట్టుబడిదారులకు బలమైన రాబడిని అందించిన 5 టాటా స్టాక్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

టాటా పవర్..
గత 6 నెలల్లో టాటా పవర్ షేరు ధర 12 శాతానికి పైగా పెరిగింది. ఈ కాలంలో కంపెనీ షేరు ధర రూ.216 నుంచి రూ.244 స్థాయికి చేరుకుంది. గత నెలలో కంపెనీ షేర్ల ధరలు 6.90 శాతం పెరిగాయి.

ట్రెంట్ లిమిటెడ్..
కంపెనీ షేరు ధర రూ.341 పెరిగింది. ఈ సమయంలో కంపెనీ షేరు ధర రూ.1,064 నుంచి రూ.1,400 స్థాయికి చేరుకుంది. అంటే 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు దాదాపు 32 శాతం రాబడి లభించింది

టాటా కెమికల్ లిమిటెడ్..
గత కొంత కాలంగా మనం గమనిస్తే అనేక కెమికల్ సెక్టార్ స్టాక్స్ తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి. అలా 6 నెలల్లో 30 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీల జాబితాలో టాటా కెమికల్స్ షేర్లు కూడా నిలిచింది. పొజిషనల్ ఇన్వెస్టర్లకు కంపెనీ 32 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో కంపెనీ షేర్లు 17 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్..
ఆరు నెలల కాలంలో టాటా మోటార్స్ షేర్లు 16.66 శాతం పెరిగాయి. కంపెనీ షేరు ధర రూ.394 నుంచి రూ.459 స్థాయికి చేరుకుంది. అయితే గత నెల రోజులుగా ఇన్వెస్టర్లకు మేలు జరగలేదు. ఈ క్రమంలో కంపెనీ షేర్లు దాదాపు 2 శాతం క్షీణించాయి.

టాటా కన్జూమర్ స్టాక్..
టాటా గ్రూప్ లోని ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 25 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. కంపెనీ షేరు ధర రూ.659 నుంచి రూ.830కి పెరిగింది. గత నెల రోజుల కాలంలో కంపెనీ షేర్ ధర 5.29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇలా స్వల్పకాలంలో టాటా గ్రూప్ లోని అనేక కంపెనీలు మంచి రాబడులను అందించాయి.