For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPO News: మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ బ్రాండ్ ఐపీవో.. ఉత్తర భారతంలో కంపెనీ హాస్పిటల్స్..

|

IPO News: ఐపీవో కోసం మార్కెట్లోకి వచ్చిన గ్లోబల్ హెల్త్ కంపెనీ ఇష్యూ ఇప్పటికే ప్రారంభమైంది. ఆషికా రీసెర్చ్ ప్రకారం కంపెనీకి చెందిన 65,641,952 ఈక్విటీ షేర్ల పబ్లిక్ ఆఫర్ ఫేస్ వ్యాల్యూ రూ.2గా ఉంది. గ్లోబల్ హెల్త్ కంపెనీలో వాటాను విక్రయించే షేర్ హోల్డర్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎలాంటి ఆదాయాన్ని పొందరు. వీటిలో అనంత్ ఇన్వెస్ట్‌మెంట్స్ 50,661,000 ఈక్విటీ షేర్లు, సునీల్ సచ్‌దేవాకు చెందిన 1,00,000 ఈక్విటీ షేర్లు ఉన్నాయి.

ఉత్తర భారతంలో..

ఉత్తర భారతంలో..

గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ప్రముఖ ప్రైవేట్ మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ బ్రాండ్ కంపెనీలలో ఒకటి. ఈ హాస్పిటల్ చైన్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సైన్సెస్, న్యూరోసైన్సెస్, ఆంకాలజీ, డైజెస్టివ్ అండ్ హెపాటోబిలియరీ సైన్సెస్, ఆర్థోపెడిక్స్, లివర్ సంబంధిత వ్యాధులు ప్రధానంగా మేదాంతా చికిత్స అందిస్తోంది. వీటికి తోడు లివర్ ట్రాన్స్ ప్లాంట్, కిడ్నీ, యూరాలజీ సంబంధిత వ్యాధులకు సైతం చికిత్స అందించటంలో ప్రసిద్ధిగాంచింది. గురుగ్రామ్, ఇండోర్, రాంచీ, లక్నో, పాట్నాలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉండగా.. కొత్తగా నోయిడాలో ఒక ఆసుపత్రి నిర్మాణంలో ఉంది.

ఆషికా రీసెర్చ్..

ఆషికా రీసెర్చ్..

ఆషికా రీసెర్చ్ రివ్యూ ప్రకారం కీలకమైన గ్రోత్ మార్కెట్లలో కంపెని తన ఉనికిని పటిష్ఠం చేసుకుంటోంది. ఇది కంపెనీ విలువను పెంచటంలో దోహదపడుతోంది. ప్రజల సౌకర్యార్థం, సంరక్షణ కోసం ప్రస్తుతం ఉన్న సౌకర్యాల్లో పడకల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అందుబాటులో ఉన్న భూమిని వైద్యపరమైన అనుబంధ సేవలకు వినియోగించేందుకు మేదాంత లక్ష్యంగా పెట్టుకుంది. మేదాంత తక్కువ ఖర్చుతో కూడిన సంరక్షణను, నాణ్యమైన ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సమాచారం, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణ, ఇతర వనరుల సమర్థ నిర్వహణ ద్వారా కంపెనీ తన లక్ష్యాలను సాధించగలదని రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
పనితీరు మెరుగుపరిచేందుకు..

పనితీరు మెరుగుపరిచేందుకు..

క్లినికల్ ఎక్సలెన్స్‌ని మెరుగుపరచడానికి ప్రత్యేక రంగాల్లో అధిక నైపుణ్యం కలిగిన కొత్త నిపుణులను నిలుపుకోవాలని, రిక్రూట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆసుపత్రుల్లో ఉపయోగించే పరికరాల వినియోగాన్ని మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. వైద్య విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మెరుగుపరుస్తూనే ఆసుపత్రులలో ఉండే సగటు నిడివిని (ALOS) తగ్గించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఆసుపత్రుల నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను నిరంతరం అమలు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ నిపుణులతో కలిసి పనిచేస్తోంది.

2026 నాటికి..

2026 నాటికి..

మేదాంతా తన హాస్సిటల్స్ లో పడకల సంఖ్యను, మౌలిక సదుపాయాలను పెంచాలని చూస్తోంది.2026 నాటికి భారత ఆరోగ్య సంరక్షణ రంగం 13 నుంచి 15 శాతం వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలతో తక్కువ-ఆదాయ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన 2018లో ప్రారంభించబడింది. ఇది భవిష్యత్తులో లక్నో, పాట్నాలోని మేదాంతకు ప్రయోజనం చేకూరుస్తుంది.

English summary

Know Business Plans and Health services Offered By Medanta that came For IPO

Know Business Plans and Health services Offered By Medanta that came For IPO
Story first published: Friday, November 4, 2022, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X