For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PhonePe: జీవితాన్ని మార్చేసిన ఐడియా.. అవకాశంగా డీమానిటైజేషన్.. వేలకోట్ల కంపెనీ విజయగాథ

|

PhonePe: వ్యాపారం చేయాలని ధృడనిశ్చయం ఉన్న వ్యక్తులకు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం కనిపిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ PhonePe ప్రారంభమే. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల యుగంలో రారాజుగా నిలిచిన ఈ వ్యాపారం ఎలా ప్రారంభమైంది. విజయవంతంగా ఎలా ముందుకు సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డీమానిటైజేషన్ అవకాశంగా మలుచుకుని..

డీమానిటైజేషన్ అవకాశంగా మలుచుకుని..

మొబైల్ వాలెట్లు, ఇతర డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నగదు తీసుకెళ్లడం దాదాపు మర్చిపోయారు. మొబైల్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు చెల్లింపు, కిరాణా సామాగ్రి ఇలా అన్ని చెల్లింపులకు మొబైల్ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సేవలను అందిస్తున్న PhonePe ప్రస్తుతం దేశంలో మిలియన్ల మందికి చేరువై విజయవంతంగా ముందుకు సాగుతోంది. దీని వెనుక నుంచి నడిపిస్తున్నది వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్.

సమీర్ నిగమ్ ఎవరు?

సమీర్ నిగమ్ ఎవరు?

PhonePeని 2015లో సమీర్ నిగమ్ స్థాపించారు. ప్రస్తుతం సమీర్ నిగమ్ కంపెనీ CEOగా ఉన్నారు. సమీర్ నిగమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2009లో సమీర్ నిగమ్ తన మొదటి కంపెనీ మైమ్360ని ప్రారంభించారు. కంటెంట్ ఓనర్‌లను కంటెంట్ ప్రొవైడర్‌లతో కనెక్ట్ చేయడం ఆ కంపెనీ పని.

సమీర్ నిగమ్ వ్యాపార ప్రయాణం..

సమీర్ నిగమ్ వ్యాపార ప్రయాణం..

గతంలో సమీర్ షాప్‌జిల్లాలో సెర్చ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. Mime360 అనేది ఆన్‌లైన్ సోషల్ మీడియా పంపిణీ ప్లాట్‌ఫారమ్ కంపెనీ. సమీర్ 2009లో ఈ కంపెనీని స్థాపించారు. అప్పట్లో దీన్ని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సమీర్ 2015లో తన సొంత మొబైల్ వాలెట్ యాప్ PhonePeని ప్రారంభించారు.

స్నేహితుల సహకారంతో

స్నేహితుల సహకారంతో

తన ఇద్దరు స్నేహితులు రాహుల్ చారి, బుర్జిన్ ఇంజనీర్ సహాయంతో.. అతను యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా ఆన్‌లైన్ చెల్లింపు చెల్లింపు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత 2016లో ఈ కంపెనీ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ కంపెనీ యాప్ 11 కంటే ఎక్కువ భారతీయ భాషల్లో వినియోగదారులకు ఎంపికను కలిగి ఉంది.

కంపెనీ విలువ..

కంపెనీ విలువ..

ప్రస్తుతం కంపెనీ విలువ రూ.43 వేల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో సమీర్ నిగమ్ ఆస్తుల విలువ రూ.17.7 కోట్లకు పైగానే ఉంది. దేశంలో 2016లో ప్రధాని మోదీ డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు PhonePe ప్రజలకు ఎంతో మేలు చేసింది. ఆ సమయంలో ప్రజలకు చేరువైంది.

యూపీఐ చెల్లింపుల వ్యవస్థలు ఆరంభ దశలో ఉన్న సమయంలో కంపెనీ మార్కెట్లోకి రావటం విజయానికి చాలా దోహదపడింది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలు ఉన్న రోజుల్లో తన వినియోగదారులకు యాప్ సౌకర్యవంతంగా చెల్లింపులు చేసేందుకు దోహదపడింది. PhonePe వంటి యాప్‌లను మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో ఇది చాలా సహాయకారిగా ఉంది.

English summary

PhonePe: జీవితాన్ని మార్చేసిన ఐడియా.. అవకాశంగా డీమానిటైజేషన్.. వేలకోట్ల కంపెనీ విజయగాథ | know about success story of PhonePe which was started by Sameer Nigam in times of demonetisation

know about success story of PhonePe which was started by Sameer Nigam in times of demonetisation
Story first published: Tuesday, September 13, 2022, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X