For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rates: విమాన టిక్కెట్ కంటే తక్కువకే 10 కేజీల బంగారం.. 1947 నాటి బంగారం రేట్లు చూస్తే షాకే..!

|

Gold Rates: బంగారం అనేది భారతీయ సంస్కృతిలో భాగమనే చెప్పుకోవాలి. పూర్వం నుంచి భారతీయలు పసిడి ప్రియులే. అయితే బంగారం ధరలు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయాయి. అవును స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గోల్డ్ రేటు 50,000 శాతం మేర పెరిగింది. దీనికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సురక్షితమైన పెట్టుబడిగా..

సురక్షితమైన పెట్టుబడిగా..

బంగారం సాధారణంగా సురక్షితమైన పెట్టుబడి అని చెబుతారు. ఇన్వెస్టర్లు ఎన్ని సమస్యలు, సవాళ్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. అందువల్ల గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ అనేది మంచి పెట్టుబడి ఎంపికల్లో ఒకటి.

ఆకర్షణీయమైన పెట్టుబడి..

ఆకర్షణీయమైన పెట్టుబడి..

దేశంలోని ఆకర్షణీయమైన పెట్టుబడుల్లో పసిడి ఒకటి. ఇది నగలు, పెట్టుబడుల్లో ముఖ్యమైన పాత్ర పోషించే లోహం. 1947లో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.88.62 పెరిగింది. కానీ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 49,140 స్థాయిలో ఉంది.

అధిక అస్థిరత..

అధిక అస్థిరత..

భారతదేశం ఇప్పటికీ బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉంది. అయితే.. భారత మార్కెట్‌లో ధర అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం నేపథ్యంలో గత కొన్ని నెలలుగా బంగారం ధరలు చాలా అస్థిరంగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దేశీయంగా బంగారం ధరలను నిర్ణయించేందుకు గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో కేంద్రం గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ని ఏర్పాటు చేసింది.

1942 నుంచి 2022 వరకు ప్రయాణం..

1942 నుంచి 2022 వరకు ప్రయాణం..

1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.88కి రెట్టింపు అయింది. ఆ తర్వాత బంగారం ధర క్రమంగా పెరగడం మొదలైంది. ద్రవ్యోల్బణ సమయంలో పెట్టుబడిదారులకు అత్యుత్తమ రక్షణను అందిస్తుంది. అయితే ఇప్పుడు బంగారం పెట్టుబడిదారులకు ద్రవ్యోల్బణాన్ని మించిన లాభాన్ని అందించడం గమనార్హం.

300 రెట్లు పెరిగింది..

300 రెట్లు పెరిగింది..

1947లో 10 కేజీల బంగారం ధర ఢిల్లీ నుంచి ముంబైకి విమాన టికెట్ ధర కంటే తక్కువగా ఉండేది. ఇండియన్ పోస్టల్ గోల్డ్ సర్వీస్ ప్రకారం.. ఆ సమయంలో బంగారం ధర రూ.88.62గా ఉంది. 7 దశాబ్దాల తర్వాత బంగారం ధర 300 రెట్లు పెరిగింది.

గోల్డ్ రేటు హిస్టరీ..

గోల్డ్ రేటు హిస్టరీ..

10 గ్రాముల బంగారం ధర.. 1970లో 184 రూపాయలు, 1980లో 1330 రూపాయలకు పెరిగింది. 1990లో రూ.3,000గా ఉన్న బంగారం ధర.. 2010లో రూ.18,500, 20415లో రూ.26,343.50, 2020లో రూ.48,651గా ఉంది. ప్రస్తుతం గోల్డ్ ధర రూ.49,000 పైగా పెరుగుదల ఉంది.

English summary

Gold Rates: విమాన టిక్కెట్ కంటే తక్కువకే 10 కేజీల బంగారం.. 1947 నాటి బంగారం రేట్లు చూస్తే షాకే..! | know about gold rates in india from 1947 to till today shocks you the history

know about gold rates in india from 1947 to till now
Story first published: Monday, August 15, 2022, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X