For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success Story: క్యాన్సర్ ను జయించి.. 10 ప్రైవేట్ జెట్ విమానాలకు యజమానై.. ఏడాదికి రూ.150 కోట్లు..

|

Success Story: 22 ఏళ్ల వయస్సులో మనలో చాలామందిని గోల్ ఏమిటి అని ప్రశ్నిస్తే ఏమని చెబుతారు. ఖచ్చితంగా చాలా మంది యువత ఉద్యోగం, విద్య, ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు బదులిస్తారు. కానీ.. అతి కొద్దిమంది మాత్రమే భిన్నంగా ఉంటారు. ఈ అమ్మాయి కూడా ఆ కోవకు చెందినదే. కేవలం 23 ఏళ్ల వయస్సులో కనికా తగ్రివాల్ ఏవియేషన్ స్టార్టప్‌ను స్థాపించింది.

ప్రస్తుతం దానిని విజయవంతంగా నడుపుతోంది. అమ్మాయిలు కొన్ని పనులకే మరిమితం అనే రోజులు పోయి.. ప్రస్తుతం అన్ని రంగాల్లో విజయాలు సాధించే రోజులు వచ్చాయి. తన ప్రయాణంలో ఎదురయ్యే అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ విజయాలు సాధిస్తున్న కనికా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కుటుంబ నేపథ్యం:

కుటుంబ నేపథ్యం:

కనికా 1994లో మార్వాడీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అనిల్ తగ్రివాల్, తల్లి సునీత. సోదరుడు కనిష్క్. కనికా విమానంలో వెళ్లాలనుకున్నప్పుడు అది సెట్ కాదని ఆమె కుటుంబం నిరాకరించింది. పలు నగరాల్లో మారుతీ షోరూమ్‌లను కలిగి ఉన్న కనికా తండ్రి రియల్ ఎస్టేట్, కెమికల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

కనికా కాలేజీ

కనికా కాలేజీ

కనికా భోపాల్‌లో జన్మించినప్పటికీ.. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తోంది. ఆమె దక్షిణ భారతదేశంలోని ఊటీలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ముంబైలో అండర్ గ్రాడ్యుయేట్ చదివారు. లండన్‌లో ఎంబీఏ కూడా చేసింది. ఎంబీఏ చదువుతున్నప్పుడే తనకు ఇష్టమైన ఏవియేషన్ పరిశ్రమకు సంబంధించిన షార్ట్ కోర్సులను కూడా పూర్తి చేసింది. ఆమె పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఈ పరిశ్రమలో పనిచేసి నైపుణ్యాన్ని సాధించింది.

 పెళ్లి ప్రస్తావనపై

పెళ్లి ప్రస్తావనపై

అన్ని కుటుంబాల్లో లాగా గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం లేదా పెళ్లి అనే ప్రశ్న తలెత్తడంతో.. ఆమె తన కోరికను కుటుంబానికి తెలిపింది. అయితే.. ఇంట్లోని వారు తన కోరిను నిరాకరించారు. తమ కుటుంబానికి ఇది సరిపోదంటూ వారు అన్నారు.

లక్ష్యం కోసం

లక్ష్యం కోసం

అయితే.. ఛార్టెడ్ ఫ్లైట్ సర్వీసులను చౌక ధరలో తీసుకురావాలని, దాని ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని కనికా కోరిక. ఇప్పుడు బస్సులు, రైళ్లు ఎలా ఉన్నాయి ఎక్కడ తక్కువగా ఉన్నాయో యాప్స్ ద్వారా తెలుసుకుని బుక్కింగ్ చేసుకుంటుంటాం. అయితే విమానయాన సంస్థలు సైతం ఇలా లిస్ట్ చేయబడాలని ప్రజలు ఆ సేవలను సద్వినియోగంచేసుకోవాలనేది కనికా లక్ష్యం.

క్యాన్సర్ బారిన పడ్డప్పటికీ..

క్యాన్సర్ బారిన పడ్డప్పటికీ..

దీన్ని అమలు చేయడానికి కంపెనీని ప్రారంభించాలనుకునే సమయంలో ఆమెకు పెద్ద షాక్ ఎదురైంది. కంపెనీని ప్రారంభించేందుకు కార్యకలాపాలు స్టార్ట్ చేసిన కొద్దిరోజులకే క్యాన్సర్‌ బారిన పడ్డారు. అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కొని దాని నుంచి కోలుకున్న ఏడాది తర్వాత మళ్లీ ఆలోచనకు కార్యరూపం ఇచ్చింది. అనారోగ్య కారణంగా ఆమె వ్యాపారం ఏడాది పాటు ఆలస్యం అయింది.

 పోరాట కాలం

పోరాట కాలం

వివిధ సవాళ్ల మధ్య కనికా తగ్రివాల్ జెట్‌సెట్‌గోను అనే స్టార్టప్ కంపెనీని 2013లో స్థాపించింది. ఇది ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేసింది. ఇది Uber లాంటి మోడల్‌తో ప్రారంభమైన కంపెనీ. ఇన్-ఫ్లైట్ టాక్సీ సర్వీస్ చాలా మందికి కొత్త ఆలోచన. ఇది కనికాను ఏడాదికి రూ. 150 కోట్లు సంపాదించే పారిశ్రామికవేత్తగా మార్చింది.

సులభంగా యాక్సెస్ చేయగల అవకాశం

సులభంగా యాక్సెస్ చేయగల అవకాశం

ఎన్నో సవాళ్ల మధ్య ఎలాగోలా ఈ స్టార్టప్ ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ ఎయిర్ టాక్సీ కంపెనీగా నిలిచింది. ఇది సాంకేతికత, ప్రత్యేక పద్ధతులు, స్మార్ట్ ప్లానింగ్ మొదలైనవాటిని కూడా ఉపయోగిస్తోంది. ఇది ఖర్చుతో కూడుకున్నది, వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి ప్రయాణికులకు విమానంలోకి వెళ్లడాన్ని ఇది సులభతరం చేసింది.

 ఆస్తి విలువ

ఆస్తి విలువ

ఫోర్బ్స్ ప్రకారం.. ప్రస్తుతం కనికా నికర విలువ సుమారు రూ.56 వేల కోట్లు. చిన్న వయసులోనే వ్యాపారం ప్రారంభించిన కనికా 32 ఏళ్ల వయసులో 10 ప్రైవేట్ జెట్ విమానాలను సొంతం చేసుకుంది. జీవితంలో ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తిని పొందిన మహిళలకు కనికా ఒక ఆశాకిరణం అని చెప్పుకోవచ్చు.

English summary

Success Story: క్యాన్సర్ ను జయించి.. 10 ప్రైవేట్ జెట్ విమానాలకు యజమానై.. ఏడాదికి రూ.150 కోట్లు.. | know about 32 years kanika tekriwal startup airtaxy service company getsetgo success story in india

know about 32 years kanika tekriwal who owns 10 private jets with her startup business
Story first published: Saturday, July 2, 2022, 12:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X