For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: బ్రోకరేజ్ మెచ్చిన స్టాక్.. లాభాల పంట.. ఇన్వెస్టర్లకు డివిడెండ్..

|

Multibagger Stock: ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా అది పెద్ద సవాలే. ఎందుకంటే మార్కెట్లు ఎక్కువ ఓలటైల్ గా ఉండటంతో సరైన స్టాక్స్ ఎంచుకోవటం కష్టతరంగా మారింది. కానీ ఈ సమయంలో బ్రోకరేజ్ సంస్థ కొనుగోలు చేయవచ్చంటూ సూచిస్తున్న స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Q2 ఫలితాలతో..

Q2 ఫలితాలతో..

ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కేవల్ కిరణ్ క్లోతింగ్ లిమిటెడ్ కంపెనీ గురించే. కంపెనీ తాజాగా త్రైమాసిక ఫలితాలను విడుదల చేయటంతో బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన విశ్వాసాన్ని మరింత పెంచుకుంది. గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్ ధర దాదాపు 134 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం ఈ మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ కూడా అందించేందుకు సిద్ధమైంది.

డిజివెండ్ ప్రకటన..

డిజివెండ్ ప్రకటన..

ప్రస్తుతం కిరణ్ క్లోతింగ్ లిమిటెడ్ తన ఇన్వెస్టర్లకు 30 శాతం డివిడెండ్ అందింస్తోంది. అంటే రూ.10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీ నవంబర్ 14ను కంపెనీ రికార్డు తేదీగా ప్రకటించింది. తాజాగా ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 44.82 శాతం పెరిగింది. ఎన్ఎస్ఈలో స్టాక్ ధర శుక్రవారం క్లోజింగ్ సమయంలో రూ.500గా ఉంది.

బ్రోకరేజ్ అంచనా..

బ్రోకరేజ్ అంచనా..

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని సూచించింది. ఇందుకోసం రూ.580 టార్గెట్ ధరతో స్టాక్‌కు BUY రేటింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ అద్భుత పనితీరు విదేశీ ఇన్వెస్టర్లను సైతం ఎక్కువగా ఆకర్షిస్తోంది. కంపెనీలో 3.95 శాతం వాటాను ఎఫ్ఐఐలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ మార్కెట క్యాప్ రూ.3,079 కోట్లుగా ఉంది.

ఏడాది కాలంలో పనితీరు..

ఏడాది కాలంలో పనితీరు..

ఈ కంపెనీ పనితీరు గత 12 నెలల్లో అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో కంపెనీ షేరు ధర 120 శాతం పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు 115.47 శాతం రాబడులను పొందారు. 6 నెలల క్రితం కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు 134 శాతం రాబడి లభించింది. నెల రోజుల క్రితం కంపెనీ షేరు ధర రూ.407 ఉండగా.. ఇప్పుడు రూ.500కి పెరిగింది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

1980లో స్థాపించబడిన ఈ కంపెనీ బ్రాండెడ్ బట్టలను తయారు చేస్తోంది. కంపెనీ ఎక్కువగా జీన్స్, వెస్ట్రన్ వేర్ వస్త్రాలను తయారీ, మార్కెటింగ్, డిజైనింగ్ లో ఉంది. ప్రస్తుతం కంపెనీకి Kornerstone Retail Ltd అనే సబ్సిడరీ కంపెనీ ఉంది. కంపెనీ 1989లో Killer పేరుతో ప్రఖ్యాత బ్రాండ్ ను లాంట్ చేసింది. ఆ తర్వాత K-Lounge, Lawman, Integriti వంటి బ్రాండెండ్ ఔట్ లెట్లను నిర్వహిస్తోంది.

Read more about: investment icici stock multibagger
English summary

Multibagger Stock: బ్రోకరేజ్ మెచ్చిన స్టాక్.. లాభాల పంట.. ఇన్వెస్టర్లకు డివిడెండ్.. | kewal kiran clothing ltd multibagger stock giving dividend icici gave buy rating

kewal kiran clothing ltd multibagger stock giving dividend icici gave buy rating ..
Story first published: Sunday, October 30, 2022, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X