For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా బ్యాంకులపై జాక్‌మా వ్యాఖ్యల ఎఫెక్ట్, అలీబాబా షేర్ పతనం: ప్రపంచ అతిపెద్ద ఐపీవోకు చైనా చెక్

|

చైనీస్ బిలియనీర్ జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ కంపెనీ ప్రపంచంలోనే 35 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఐపీవోకు సిద్దమైన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు అటువైపు ఆసక్తిగా చూశాయి. ఏ కంపెనీకైనా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఆరంగేట్రం. యాంట్ గ్రూప్‌లో అలీబాబా గ్రూప్‌కు మూడో వంతు వాటా ఉంది. ఈ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. హాంగ్‌కాంగ్, షాంఘైలలో లిస్టింగ్‌కు కంపెనీలు సన్నాహాలు చేస్తున్న సమయంలో చైనీస్ బ్యాంకులపై జాక్ మా వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఐపీవోకు అధికారులు చెక్ చెప్పడంతో పాటు, అలీబాబా గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి.

మార్కెట్‌ను కాపాడిన బ్యాంకులు, రిలయన్స్ భారీ దెబ్బ.. రూ.లక్షల కోట్లు హాంఫట్మార్కెట్‌ను కాపాడిన బ్యాంకులు, రిలయన్స్ భారీ దెబ్బ.. రూ.లక్షల కోట్లు హాంఫట్

చివరి నిమిషంలో షాకిచ్చిన చైనా అధికారులు

చివరి నిమిషంలో షాకిచ్చిన చైనా అధికారులు

గురువారం లిస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా, యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకు చైనా అధికారులు మంగళవారం షాకిచ్చారు. మొదట షాంఘై స్టాక్ ఎక్సేంజీ లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా, ఆ తర్వాత హాంగ్‌కాంగ్ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. దీంతో 35 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. ఈ వార్తలతో అమెరికా మార్కెట్లో జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేర్ 10 శాతం మేర నష్టపోయింది. ఈ రోజు కూడా 7 శాతం మేర నష్టాల్లో ఉంది.

జాక్ మా వ్యాఖ్యల ఫలితం!

జాక్ మా వ్యాఖ్యల ఫలితం!

యాంట్ గ్రూప్ ప్రమోటర్ అయిన జాక్ మా ఇటీవల చైనీస్ బ్యాంకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ఫలితం కావొచ్చునని చెబుతున్నారు. ఆన్‌లైన్ మైక్రో రుణాలు అందించే యాంట్ గ్రూప్‌ను జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ ప్రమోట్ చేసింది. ఆన్‌లైన్ లెండింగ్ పైన సవరించిన ఫిన్‌టెక్ నిబంధనలు, లిస్టింగ్‌కు సంబంధించిన వివరాల వెల్లడిలో వైఫల్యం వంటి కారణాలతో యాంట్ గ్రూప్ లిస్టింగ్‌కు చైనీస్ నియంత్రణ సంస్థలు మోకాలడ్డినట్లుగా అభిప్రాయపడుతున్నారు.

చైనీస్ బ్యాంకులపై జాక్‌మా ఏమన్నారు

చైనీస్ బ్యాంకులపై జాక్‌మా ఏమన్నారు

రెండు వారాల క్రితం జాక్ మా చైనీస్ బ్యాంకింగ్ సిస్టంపై విమర్శలు గుప్పించారు. షాంఘైలో జరిగిన హైప్రొఫైల్ ఫైనాన్షియల్ ఫోరంలో ఆయన ఈ విమర్శలు చేశారు. చైనాలో ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయన జాక్ మా అన్నారు. చైనీస్ బ్యాంకులు పాన్ షాప్‌ల (సెక్యూర్డ్ లోన్లు అందించే పాన్ బ్రోకర్స్) వలె తయారయ్యాయని వ్యాఖ్యానించారు. మీరు బ్యాంకుల నుండి 1,00,000 యువాన్లు తీసుకుంటే మీరు కాస్త భయపడతారని, మిలియన్ యువాన్లు తీసుకుంటే మీరు, బ్యాంకులు భయపడతారని, కానీ 1 బిలియన్ యువాన్లు తీసుకుంటే మీరు భయపడరని, బ్యాంకు సమస్య అన్నారు.

English summary

చైనా బ్యాంకులపై జాక్‌మా వ్యాఖ్యల ఎఫెక్ట్, అలీబాబా షేర్ పతనం: ప్రపంచ అతిపెద్ద ఐపీవోకు చైనా చెక్ | Jack Ma's blunt words just cost him $35 billion, China blocks Ant IPO

Over the past few weeks, stock markets around the world were waiting anxiously as Chinese billionaire Jack Ma’s Ant Group Co was getting ready for the world’s biggest initial public offering (IPO) at $35 billion. It would have been the world’s largest stock market debut for any company with billions on the line.
Story first published: Wednesday, November 4, 2020, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X