మార్కెట్లో ఐపీవో జూమ్: డిసెంబర్, వచ్చే ఏడాదిలో మరిన్ని...
కరోనా కారణంగా మార్చి నెలలో భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా కళకళలాడుతున్నాయి. మున్ముందు మరిన్న ఐపీవోలు వస్తున్నాయి. డిసెంబర్ 2వ తేదీన బర్జర్ కింగ్ ఐపీవో రానుంది. ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.59 నుండి రూ.60 కాగా, ఐపీవో సైజ్ రూ.810 కోట్లు. ఇటీవల గ్రాండ్ ఫార్మా రూ.6,479.5 కోట్లతో వచ్చింది. డిసెంబర్ నెలలో రైల్ టెల్ లిమిటెడ్, కళ్యాణ్ జ్యువెల్లర్స్, హోమ్ ఫస్ట్ పైనాన్స్ లిమిటెడ్, బెక్టోర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉన్నాయి.
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీవో సైజ్ రూ.1500 కోట్లు కాగా, కళ్యాణ్ జ్యువెల్లరీస్ ఐపీవో సైజ్ రూ.1700 కోట్లు. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవో సైజ్ రూ.1,000 కోట్లు. 2021లో రానున్న స్టడ్ యాక్సెసరీస్ లిమిటెడ్ ఐపీవో సైజ్ రూ.450 కోట్లు. దొడ్ల డైరీ కూడా వచ్చే ఏడాది ఐపీవోకు రానుంది.

చైన్ రెస్టారెంట్ల సంస్థ బర్గర్ కింగ్ షేర్ మార్కెట్లోకి మరో రెండు రోజుల్లో అడుగు పెట్టనుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) తేదీని నిర్ధారించింది. డిసెంబర్ 2న షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు తెలిపింది. అమెరికాకు చెందిన బర్గర్ కింగ్ భారతీయ షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక్కో షేర్ విలువ రూ.59 నుంచి రూ.60. ఈక్విటీ షేర్ ఫేస్ వేల్యూతో పోల్చుకుంటే ఈ మొత్తం ఆరు రెట్లు అధికం. 2వ తేదీ ఈ సంస్థ షేర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 4వ తేదీన క్లోజ్ అవుతాయి. ఈ ఐపీవో ద్వారా రూ.810 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
కాగా, ఈ ఏడాది నవంబర్ నాటికి దాదాపు రూ.25,000 కోట్లు ఐపీఓల ద్వారా వచ్చాయి. బర్గర్ కింగ్ ఐపీవో అదనం. 2019లో ఇదే కాలానికి సమీకరించిన నిధులతో పోల్చుకుంటే ఈ ఏడాది ఐపీవోలు రూ.12,362 కోట్లు అధికం.