For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్

|

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (మే 19) భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1416 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 431 పాయింట్లు క్షీణించింది. దాదాపు అన్ని రంగాలు కూడా 3 శాతం మేర పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 2 శాతం, స్మాల్ క్యాప్ 100 సూచీ 1 శాతం క్షీణించాయి.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రతికూల ధోరణిలో ఉండటంతో భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మే నెలలోనే ఇప్పటి వరకు రూ.38 వేల కోట్ల విలువైన పొజిషన్లను విక్రయించారు. భవిష్యత్తులో సూచీలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేటు సహా వివిధ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు ప్రభావం కూడా ఉంటుంది.

Investors poorer by Rs 7 trillion as Sensex crashes 1416 points

బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌లో రూ.255.7 లక్షల కోట్లు కాగా, నేడు రూ.249.17 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక, ఇటీవలే ఐపీవోకు వచ్చిన ఎల్ఐసీ షేర్ వ్యాల్యూ నేడు మరో 4 శాతం పడిపోయింది. ఈ రోజు రూ.840.20 వద్ద ముగిసింది.

అమెరికా మార్కెట్లు గత రెండేళ్లలో ఎన్నడూ లేని పతనాన్ని చూశాయి. అమెరికా మార్కెట్లలో కూడా మాంద్యం భయాలు కనిపించాయి. ఫెడ్ ద్రవ్య పరపతి విధానం మరింత కఠినతరం కానుందనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్భణ ఆందోళనలను ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తోంది. అమెరికాలో వినిమయ వస్తువుల ధరలు 8.2 శాతం పెరగగా, ఇది నలభై ఏళ్ల గరిష్టం.

English summary

ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్ | Investors poorer by Rs 7 trillion as Sensex crashes 1416 points

Global markets roiled on Thursday, a day after Wall Street witnessed its worst one-say sell-off since June 2020. Back home, the S&P BSE Sensex crashed 1,416 points, or 2.6 per cent, to end at 52,792 on the BSE.
Story first published: Thursday, May 19, 2022, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X