ఒక్కరోజులో రూ.2.72 లక్షల కోట్ల సంపద ఆవిరి: రెండ్రోజుల్లో భారీ పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. గత వారం చివరి సెషన్లో 550 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, నేడు మరో 470 పాయింట్లు పడిపోయింది. దీంతో ఈ రెండు రోజుల్లోనే 1,020 పాయింట్ల వరకు పతనమైంది. గత శుక్రవారం మార్కెట్ నష్టంతో ఇన్వెస్టర్లు ఆ ఒక్కరోజు రూ.2.23 లక్షల కోట్లు నష్టపోయారు. నేడు 470 పాయింట్ల నష్టంతో రూ.2.7 లక్షల కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లు కోల్పోయారు. ఇన్వెస్టర్లు గత రెండు రోజులుగా ప్రాఫిట్ బుకింగ్‌కు ఎగబడటంతో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే

మార్కెట్ క్యాప్ రూ.192 లక్షల కోట్లకు
అదానీ గ్రీన్ 1 శాతం మేర లాభపడింది. IRFC ఐపీవోకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు 51 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యారు. ప్రైస్ కట్, ధరల పెరుగుదల వంటి వివిధ కారణాలతో జేఎస్‌పీఎల్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టపోయాయి. అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగియగా, మెటల్ ఏకంగా 4 శాతం మేర పడిపోయింది. ఇన్వెస్టర్లలు 2.72 లక్షల కోట్లు నష్టపోవడంతో బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ.192.70 లక్షల కోట్లకు తగ్గింది.

ఇవి ఉదుర్స్
మిడ్ క్యాప్ సూచీల్లో ట్రెంట్, వల్‌పూల్, జుబిలాంట్ ఫుడ్ వర్క్స్, కీఈఎల్ ఎలక్ట్రానిక్స్, టాటా ఎలెక్సీ, సీఎస్‌బీ బ్యాంకు రెండు శాతం నుండి ఏడు శాతం మేర లాభపడ్డాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం ఫైనన్షియల్ సర్వీసెస్, సెయిల్, రెయిన్ ఇండస్ట్రీస్, శోభా, వెల్స్‌పన్ కార్ప్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. 938 స్టాక్స్ లాభాల్లో, 2090 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 218 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. 37 షేర్లు 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 335 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకగా, 330 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

రూ.1.95 లక్షల కోట్ల నుండి రూ.192 కోట్లకు
మొన్న సెన్సెక్స్ భారీగా పతనం కావడంతో ఇన్వెస్టర్లు ఆ రోజు రూ.2.23 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ సెన్సెక్స్ 30 స్టాక్స్ 550 పాయింట్లు నష్టపోయాయి. గతవారం చివరి సెషన్లో ఓ సమయంలో ఏకంగా 800 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 550 పాయింట్లు కోల్పోయింది. చివరకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,23,012.44 కోట్లు క్షీణించి రూ.1,95,43,560.22 కోట్లకు పడిపోయింది. నేడు మరింత పడిపోయి రూ.192 లక్షల కోట్లకు తగ్గింది.