For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థికవృద్ధి పట్టాలెక్కేందుకు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆర్బీఐ గవర్నర్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు చితికిపోయాయి. జూన్ నెల నుండి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఆగ్రరాజ్యం మొదలు దాదాపు ఏ దేశమైనా కోలుకోవడానికి ఏడాది నుండి సంవత్సరం, అంతకుమించి పడుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి, వృద్ధి రేటు పెరగడానికి నిపుణులు సూచనలు చేస్తున్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్థిక వ్యవస్థపై స్పందించారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నందున మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను వేగవంతం చేస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి బలంగా పుంజుకోగలదని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఎకానమీ పురోగమించేందుకు ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు వేగవంతం చేయాలన్నారు. సీఐఐ ఇండియా ఇంక్ కార్యక్రమంలో మాట్లాడారు.

Infrastructure Push Can Reignite Economic Growth: RBI Governor

మౌలిక రంగాల కల్పనలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెద్ద ఎత్తున అవసరమన్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ సంస్కరణలు కొత్త అవకాశాలను కల్పించాయన్నారు. వ్యవసాయ రంగం ప్రశావంతంగా ఉందన్నారు. ఫారెక్స్ రేటు గురించి మాట్లాడుతూ.. రూపాయిపై ఆర్బీఐకి ఫిక్స్డ్‌ టార్గెట్ లేదని, అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు.

English summary

ఆర్థికవృద్ధి పట్టాలెక్కేందుకు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆర్బీఐ గవర్నర్ | Infrastructure Push Can Reignite Economic Growth: RBI Governor

RBI Governor Shaktikanta Das on Monday made a strong case for stepping up investments in the infrastructure sector to restart the economy reeling under the impact of the COVID-19 pandemic.
Story first published: Monday, July 27, 2020, 14:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X