For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేతనాలు పెరిగాయి, లాభం తగ్గింది: 27% పెరిగిన ఇన్ఫోసిస్ సీఈవో రెమ్యునరేషన్

|

గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గాను ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.46.12 కోట్ల (6.1 మిలియన్ డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. బోనస్, ప్రోత్సాహకాలు, స్టాక్ యూనిట్స్ అన్నీ కలుపుకొని 27 శాతం పెరిగి రూ.46 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది (2018-19) ఆయన వేతనం రూ.4.8 మిలియన్లుగా ఉంది. ఈ మేరకు కంపెనీ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC)కు కంపెనీ ఫామ్ 20ఎఫ్ దాఖలు చేసింది.

విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌కు భిన్నంగా.. ఉద్యోగులకు HCL బోనస్, 15,000 కొత్త ఆఫర్లకు ఓకేవిప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌కు భిన్నంగా.. ఉద్యోగులకు HCL బోనస్, 15,000 కొత్త ఆఫర్లకు ఓకే

వేతనాలు ఇలా

వేతనాలు ఇలా

సలీల్ పరేఖ్ వేతనం 8,01,264 డాలర్లు కాగా, 15,40,305 డాలర్లు బోనస్, ప్రోత్సాహకాలని ఇన్ఫోసిస్ తెలిపింది. కంపెనీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు వేతనం 29 శాతం పెరిగి 2.3 మిలియన్ డాలర్లు (రూ.17.3 కోట్లు), ప్రెసిడెంట్స్ రవికుమార్, మోహిత్ జోషి రెమ్యునరేషన్ వరుసగా 25 శాతం పెరిగి 3 మిలియన్ డాలర్లు, 24.6 శాతం పెరిగి 3.2 మిలియన్ డాలర్లుగా ఉంది. సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ 1.5 మిలియన్ డాలర్ల (రూ.11.3 కోట్లు) వేతనం అందుకున్నారు.

గతంలో కంటే ఎంత పెరిగిందంటే

గతంలో కంటే ఎంత పెరిగిందంటే

సలీల్ పరేఖ్ వేతనం 2018-19లో 4.8 మిలియన్ డాలర్లు కాగా, 2019-20లో 6.1 మిలియన్ డాలర్లుగా ఉంది. వరుసగా ప్రవీణ్ రావు రెమ్యునరేషన్ 1.7 మిలియన్ డాలర్ల నుండి 2.2 మిలియన్ డాలర్లకు, నీలాంజన్ రాయ్ 0.3 మిలియన్ డాలర్ల నుండి 1.5 మిలియన్ డాలర్లకు, మోహిత్ జోషి 2.6 మిలియన్ డాలర్ల నుండి 3.2 మిలియన్ డాలర్లకు, రవి కుమార్ 2.4 మిలియన్ డాలర్ల నుండి 3 మిలియన్ డాలర్లు, కృష్ణమూర్తి శంకర్ (గ్రూప్ హెచ్ఆర్ హెడ్) 0.8 మిలియన్ డాలర్ల నుండి 1 మిలియన్ డాలర్లకు పెరిగింది.

శాలరీ పెరగడం వల్ల లాభం తగ్గింది..

శాలరీ పెరగడం వల్ల లాభం తగ్గింది..

వేతనాల పెరుగుదల వల్ల కంపెనీ లాభదాయకత తగ్గిందని, హెచ్1బీ వీసాల కోసం అధిక వ్యయాలు, క్రాస్ కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా ప్రభావం చూపాయని ఇన్ఫోసిస్ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఇన్ఫోసిస్ లాభదాయకత స్వల్పంగా తగ్గవచ్చునని తెలిపింది. కరోనా నేపథ్యంలో కొంతమంది క్లయింట్స్ రాయితీలు కోరుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు, రిటైల్, కన్స్యూమర్ గూడ్స్, ఇంధనం, తయారీ రంగాలపై కరోనా 19 ప్రభావం అధికంగా ఉందని, దీని వల్ల ఈ రంగ సంస్థలు ఐటీ వ్యయాలు తగ్గించుకోవాలని, కాంట్రాక్టులు రద్దు చేసుకునే అవకాశం ఉందని, ఈ ప్రభావం ఇన్ఫోసిస్ పైన ఉండవచ్చునని అంచనా వేసింది.

పెరిగిన రెవెన్యూ

పెరిగిన రెవెన్యూ

తమ ఉద్యోగుల్లో 98 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో ఒక్కో ఉద్యోగిపై రెవెన్యూ 2019లో 54,0.8 కాగా 2020 నాటికి 54,142గా ఉన్నట్లు తెలిపింది. హైరింగ్ సబ్ కాంట్రాక్ట్స్, టెంపరరీ స్టాఫ్ పైన 945 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాదిలో ఇది 860 మిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొంది. మార్చి 31వ తేదీ నాటికి అమెరికాలో 50 శాతం కంటే తక్కువ ఉద్యోగులు హెచ్1బీ, ఎల్1 వీసా కలిగి ఉన్నవారు ఉన్నారని తెలిపింది.

English summary

వేతనాలు పెరిగాయి, లాభం తగ్గింది: 27% పెరిగిన ఇన్ఫోసిస్ సీఈవో రెమ్యునరేషన్ | Infosys CEO Parekh's remuneration up 27% to $6.15 million in FY20

Infosys CEO Salil Parekh's total remuneration jumped 27% to $6.15 million in the financial year 2019-20, while COO Pravin Rao's compensation rose 29% to nearly $2.3 million.
Story first published: Monday, June 1, 2020, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X