For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిషిసునక్ కరోనా స్కీం, బ్రిటన్‌లో ఇన్ఫోసిస్ ఆ ఉద్యోగులకు 80% శాలరీ!

|

లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత, శాలరీ కోత ఉంది. ఆయా దేశాల ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ఆదుకుంటున్నాయి. భారత ప్రభుత్వం ఉద్యోగాలను కాపాడే ఉద్దేశ్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ.4 లక్షల మేర ప్రయోజనం సహా రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. బ్రిటన్ సంస్థలను ఆదుకునేందుకు కొన్ని కంపెనీల ఉద్యోగాల్లో వేతనాలను 80 శాతం భరిస్తోంది. ఈ జాబితాలో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ కూడా ఉందని తెలుస్తోంది.

ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో గుడ్‌న్యూస్: వారికి చేదు, ఈ 3 నష్టాలుఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో గుడ్‌న్యూస్: వారికి చేదు, ఈ 3 నష్టాలు

ఇన్ఫీ ఉద్యోగులకు 80 శాతం ప్రభుత్వం వేతనం!

ఇన్ఫీ ఉద్యోగులకు 80 శాతం ప్రభుత్వం వేతనం!

బ్రిటిష్ ఛాన్స్‌లర్ రిషి సునక్ ప్రవేశపెట్టిన కరోనా వైరస్ జాబ్ రిటెక్షన్ పథకం నుండి ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఉన్నదని తెలుస్తోంది. ఈ పథకం కింద సెలవులో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం 80 శాతం వేతనం (గరిష్టంగా నెలకు 2500 పౌండ్స్) ఇస్తుంది. తమ ఉద్యోగుల్లో 3 శాతం మందిని వేతనం లేని సెలవులపై పంపించినట్లు తెలిపింది.

ఆపద సమయంలో ఆదుకునేందుకు

ఆపద సమయంలో ఆదుకునేందుకు

కరోనా మహమ్మారి - షట్ డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి-డిమాండ్ లేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి కంపెనీలను ఆదుకునేందుకు బ్రిటన్ జాబ్ రిటెక్షన్ పథకం తీసుకు వచ్చింది. వేతనాలు లేకుండా ఇళ్లకు పంపించిన ఉద్యోగుల శాలరీలను ప్రభుత్వం 80 శాతం భరిస్తుంది. 'ఈసంక్షోభం నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండటం, ఉద్యోగాలు, వ్యాపారాలను కాపాడటం తమ ప్రాధాన్యత. జాబ్ రిటెక్షన్ స్కీం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం వంటి పథకాలు ప్రజలు, వ్యాపారులకు అందుబాటులో ఉన్నాయి' అని రిషి సునక్ తెలిపారు.

8.4 మిలియన్ల మందికి వేతనాలు

8.4 మిలియన్ల మందికి వేతనాలు

వేతనం లేకుండా ఇంటికి పరిమితం చేసిన ఉద్యోగులకు జూన్, జూలైలోను కంటిన్యూ అవుతున్నట్లు తెలిపారు. ఈ స్కీం అక్టోబర్ వరకు ముగిసే అవకాశం ఉంది. దాదాపు 8.4 మిలియన్ల మంది ఉద్యోగులు కరోనా జాబ్ రిటెక్షన్ స్కీం కింద ఉన్నారు. వీరికి ప్రభుత్వం 80 శాతం వేతనాలు చెల్లిస్తుంది. దీనిని తొలుత జూలై వరకే ముగించాలని భావించారు. కానీ కరోనా ప్రభావం దృష్ట్యా స్కీం కాలపరిమితిని పొడిగించారు.

English summary

రిషిసునక్ కరోనా స్కీం, బ్రిటన్‌లో ఇన్ఫోసిస్ ఆ ఉద్యోగులకు 80% శాలరీ! | Infosys among UK firms accessing Rishi Sunak's COVID 19 job saving scheme

Infosys, co-founded by Rishi Sunak’s father-in-law Narayana Murthy, said it had used the furlough-or forced leave-option for 3 percent of its staff in order to tide through the lockdown imposed to curb the spread of the deadly virus.
Story first published: Monday, June 1, 2020, 19:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X