For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లు డౌన్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 22) స్వల్ప నష్టాల నుండి భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 124.75 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 49,500 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 14,656.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 49,595 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం పది గంటల వరకు 49,663 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 46,361 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

ఉదయం సెషన్లో టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, దివిస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌‍లో టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయిఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి

అంతకంతకూ డౌన్

అంతకంతకూ డౌన్

సూచీలు దాదాపు ఏ దశలోను కోలుకోలేదు. ఉదయం నుండి నష్టాల్లో ఉండటమే కాదు, అంతకంతకూ పతనమయ్యాయి. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక్కసారి యాభై పాయింట్ల లాభంలోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ, అంతలోనే పడిపోయింది. గం.11.30 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ నష్టం మాత్రమే తగ్గింది. నేడు 49,677 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,190 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

కారణాలు కొన్ని...

కారణాలు కొన్ని...

ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్ననే చివరి గంటలోనే లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ ఒరవడి ఈ రోజు కూడా కనిపించింది. దీంతో సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లోను లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 1 శాతం మేర నష్టపోయినప్పటికీ రూ.2000కు పైనే ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి స్టాక్స్ ఒక శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ 50 స్టాక్స్ 0.52 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.23 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 2.96 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.17 శాతం, నిఫ్టీ ఐటీ 0.33 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ బ్యాంకు 1.68 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.81 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.43 శాతం, నిఫ్టీ మీడియా 0.56 శాతం, నిఫ్టీ మెటల్ 2.50 శాతం, నిఫ్టీ ఫార్మా 0.73 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.20 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.14 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.86 శాతం నష్టపోయాయి.

English summary

ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లు డౌన్ | Indices trade lower on weak global cues: TCS, Infosys top losers

Benchmark indices opened marginally lower on weak global cues. HDFC, Axis Bank, Tech Mahindra, Hindalco and NTPC were among major losers on the Nifty.
Story first published: Friday, January 22, 2021, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X