లాభాల్లో స్టాక్ మార్కెట్లు, రంగాలవారీగా...: టాప్ గెయినర్స్, లూజర్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(జనవరి 13) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడి 49,800 సమీపానికి చేరుకుంది. తద్వారా సెన్సెక్స్ 50,000 దిశగా కనిపించింది. ఆ తర్వాత స్వల్పంగా క్షీణించినప్పటికీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు సూచీలు దూసుకెళ్తున్నాయి. అయితే ప్రారంభంలో భారీ లాభాల్లో దూసుకెళ్లిన సెన్సెక్స్, ఆ తర్వాత స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయింది.

సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ నేడు ఉదయం 9.17 సమయానికి 216.28 పాయింట్లు లేదా 0.44% ఎగబాకి 49,733.39 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 67.00 పాయింట్లు లేదా 0.46% లాభపడి 14,630.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1106 షేర్లు లాభాల్లో, 336 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 58 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు ఎగబాకి 73.17 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 73.25 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 49,795ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 3.87 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.82 శాతం, ఐవోసీ 3.57 శాతం, ఎన్టీపీసీ 3.44 శాతం, ONGC 2.95 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 1.88 శాతం, శ్రీసిమెంట్స్ 1.42 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.36 శాతం, టైటాన్ కంపెనీ 1.24 శాతం, యూపీఎల్ 1.20 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.02 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.08 శాతం నష్టపోయాయి. రంగాలు వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.97 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.20 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.94 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.73 శాతం, నిఫ్టీ మీడియా 0.53 శాతం, నిఫ్టీ మెటల్ 0.28 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.32 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.25 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.02 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియర్స్ 0.50 శాతం, నిఫ్టీ ఐటీ 0.51 శాతం, నిఫ్టీ ఫార్మా 0.59 శాతం నష్టపోయాయి.