For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 51,000కు సమీపంలో సెన్సెక్స్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 9) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. సోమవారం ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకిన అమెరికా సూచీలు టెక్ షేర్ల అమ్మకాలతో నష్టపోయాయి. దీంతో ఫిబ్రవరి 12వ తేదీ నాటి ఆల్ టైమ్-హైతో పది శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. సౌదీ చమురు కేంద్రాలు టార్గెట్‌గా డ్రోన్ దాడి అనంతరం నిన్న బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ భారీగా పెరిగింది. నేడు కాస్త చల్లబడ్డాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడి, పరుగు పెట్టింది.

HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...

సెన్సెక్స్, నిఫ్టీ జంప్

సెన్సెక్స్, నిఫ్టీ జంప్

సెన్సెక్స్ నేడు 51,000 సమీపానికి చేరుకుంది. నిన్న 50,441 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 50,714 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,994.60 వద్ద గరిష్టాన్ని, 50,702 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,049.90 వద్ద ప్రారంభమై, 15,119 వద్ద గరిష్టాన్ని, 15,0.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడి 50,884 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు ఎగిసి 15,085 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 3.76 శాతం, గ్రాసీమ్ 3.11 శాతం, ICICI బ్యాంకు 3.09 శాతం, HDFC బ్యాంకు 2.85 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.53 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో BPCL 4.84 శాతం, గెయిల్ 2.24 శాతం, ఐవోసీ 2.17 శాతం, UPL 1.21 శాతం, ONGC 0.97 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బీపీసీఎల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 సూచీ 0.75 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2.79 శాతం నష్టపోయింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ఆటో 0.34 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.08 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34 శాతం, నిఫ్టీ మీడియా 0.13 శాతం, నిఫ్టీ మెటల్ 0.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.24 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.06 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 1.31 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.40 శాతం, నిఫ్టీ ఐటీ 0.49 శాతం, నిఫ్టీ ఫార్మా 0.53 శాతం నష్టపోయాయి.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 51,000కు సమీపంలో సెన్సెక్స్ | Indices trade higher with Nifty above 15K: banks rise, energy stocks fall

Nifty Energy is down a percent while Bank Nifty added a percent. Midcap and smallcap indices are also trading in the green.
Story first published: Tuesday, March 9, 2021, 12:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X