For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిఫ్టీ బ్యాంక్@30,000: భారీ లాభాల నుండి, నష్టాల్లోకి మార్కెట్లు: రిలయన్స్ ఎగిసినా...

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (నవంబర్ 25) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. నిన్న ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సూచీలు, నేడు అదే ఒరవడిని కొనసాగించాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 302.01 పాయింట్లు (0.68 శాతం) లాభపడి 44,825.03 వద్ద, నిఫ్టీ 87.80 పాయింట్లు(0.67 శాతం) ఎగిసి 13,143 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సీఎల్ఎస్ఏ టాటా మోటార్స్ స్టాక్ బై కాల్ టార్గెట్ ధరను రూ.220గా పేర్కొనడంతో ఈ స్టాక్ దాదాపు రెండు శాతం ఎగిసింది. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి.

 అంతలోనే 35 నుండి రెండో కుబేరుడిగా.. నిన్న జుకర్‌బర్గ్, నేడు బిల్‌గేట్స్‌ను దాటేసిన ఎలాన్ మస్క్ అంతలోనే 35 నుండి రెండో కుబేరుడిగా.. నిన్న జుకర్‌బర్గ్, నేడు బిల్‌గేట్స్‌ను దాటేసిన ఎలాన్ మస్క్

లేచి'పడిన' సెన్సెక్స్

లేచి'పడిన' సెన్సెక్స్

టాటా మోటార్స్ షేర్ గత నెల రోజుల్లో రూ.130 నుండి రూ.170కి ఎగిసింది. ఈ రోజు ఓ సమయంలో రూ177 స్థాయిని సమీపించింది.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు వరుసగా ఏడో రోజు నష్టపోయింది. నేడు 4.79 శాతం క్షీణించి రూ.6.95 వద్ద ట్రేడ్ అయింది.

ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. నిన్న సెన్సెక్స్ 44,523 పాయింట్ల వద్ద ముగియగా నేడు ఓ సమయంలో 44,800 పాయంట్లను దాటి, 11 గంటల సమయంలో 44,265 పాయింట్లకు పడిపోయింది.

నేటి గరిష్టం నుండి దాదాపు 600 పాయింట్లు క్షీణించింది.

రూ.1969 వద్ద రిలయన్స్

రూ.1969 వద్ద రిలయన్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ 4.07 శాతం, HDFC లైఫ్ 1.76 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.48 శాతం, శ్రీసిమెంట్స్ 1.04 శాతం, గ్రాసీమ్ 0.91 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.25 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.04 శాతం, టెక్ మహీంద్ర 1.89 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.68 శాతం, సన్ ఫార్మా 1.66 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ ఉన్నాయి. రిలయన్స్ స్టాక్ నేడు 0.27శాతం లాభపడి రూ.1969 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా చూస్తే...

రంగాలవారీగా చూస్తే...

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.75 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.66 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.37 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.76 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.84 శాతం, నిఫ్టీ ఐటీ 0.99 శాతం, నిఫ్టీ మెటల్ 0.32 శాతం, నిఫ్టీ ఫార్మా 1.28 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.22 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.58 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ మీడియా 0.25 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.38 శాతం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంకు 30,000 దాటింది.

English summary

నిఫ్టీ బ్యాంక్@30,000: భారీ లాభాల నుండి, నష్టాల్లోకి మార్కెట్లు: రిలయన్స్ ఎగిసినా... | Indices slip into the red with Nifty below 13,000

Among the sectors, the banking index outperformed while the midcap and smallcap indices gained half a percent each.
Story first published: Wednesday, November 25, 2020, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X