For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: పండక్కి ముందే పాతాళంలోకి స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో రూ.లక్షల కోట్లు ఆవిరి..

|

Stock Market: ఈ వారం ప్రారంభం నుంచి భారీ ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. కోలుకుంటుందనుకున్న మార్కెట్లు రోజురోజుకూ పతనం అవుతూ పాతాళంలోకి జారుకుంటున్నాయి. పండుగకు ముందు వారాంతం రోజు సైతం సూచీలు చతికిలబడి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్ సూచీలు..

మార్కెట్ సూచీలు..

ప్రస్తుతం మార్కెట్ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నప్పటికీ కొంత తేరుకున్నాయి. మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 636 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ సూచీ 202 పాయింట్లను, బ్యాంక్ నిఫ్టీ 523 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 833 పాయింట్ల నష్టంలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

భయాల్లో మార్కెట్లు..

భయాల్లో మార్కెట్లు..

చాలా కాలం విరామం తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరగటంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న తరుణంలో మార్కెట్లను భయాలు ఆవరించాయి. అసలే ఆర్థిక మాంద్యం దెబ్బకు వ్యాపారాలు కుదేలు కాగా.. ఇప్పుడు కరోనా రక్కసి మళ్లీ పంజా విసరటం మదుపరులకు నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో చాలా మంది మార్కెట్లను వీడేందుకు తమ ఇన్వెస్ట్ మెంట్లను విక్రయిస్తున్నారు. అమాంతం అలా అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవటం మార్కెట్లలో బేజారుకు కారణంగా నిలిచింది. ఇన్వెస్టర్లు ముందస్తుగా అప్రమత్తత కారణంగా ఆసియా పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం సైతం కరోనాపై ఉన్నత స్థాయి చర్చ జరపటం తీవ్రతను చెప్పకనే చెబుతోంది.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న వేళ ఎన్ఎస్ఈ సూచీలోని దివీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలుస్తున్నాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

భారీ ఒడిదొడుకులు మధ్య అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజస్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, హీరో మోటొకర్ప్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, విప్రో, టాటా కన్జూమర్, పవర్ గ్రిడ్, రిలయన్స్, యూపీఎల్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

English summary

Stock Market: పండక్కి ముందే పాతాళంలోకి స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో రూ.లక్షల కోట్లు ఆవిరి.. | Indian stock market Indices tanked amid rising covid fears investors selling heavily

Indian stock market Indices tanked amid rising covid fears investors selling heavily..
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X