For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Layoff News: 27 వేల మందిని తొలగించిన స్టార్టప్ కంపెనీలు.. అసలు ఏం జరుగుతోందంటే..?

|

Startup News: గడచిన ఏడాదిన్నర కాలంలో దేశంలోని స్టార్టప్ కంపెనీలు దాదాపుగా 27 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్యను చూస్తే షాకింగ్ గా ఉంది. ఇదే క్రమంలో దేశంలోని వర్క్ ఫోర్స్ పరిస్థితి సమీప భవిష్యత్తులో ఎలాఉంటందనేది అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్న అంశం.

ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో స్టార్టప్ కంపెనీలు తమ వ్యాపారాలను స్కేల్ చేసేందుకు తగిన నిధులు దొరకక పోవటంతో తొలగింపులకు ఉపక్రమించాయి. అయితే ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ మెరుగుపడుతుండడంతో పలు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేసి పెద్ద షాక్‌కు గురయ్యాయి. యూఎస్ దివాలాతో పాటు అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం కంపెనీలు ప్రతికూల పవనాలు వీసేలా చేస్తోంది.

sadtech

ఈ క్రమంలో 2023 ప్రారంభం నుంచి పెట్టుబడులను పెంచాలని ప్రయత్నించిన అనేక స్టార్టప్ కంపెనీల వ్యాల్యుయేషన్ డౌన్ గ్రేడ్ చేయబడింది. దీంతో కొత్తగా ఐపీవోలను తీసుకురావాలని చూస్తున్న అనేక కంపెనీలు తమ ప్రణాళికలను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ కారణంగా అగ్రశ్రేణి స్టార్టప్‌ల మార్కెట్ విలువలు పడిపోయాయి. ఈ కారణంగా కొత్త ఉద్యోగాలు, విస్తరణలు ఉండవని తెలుస్తోంది. పైగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలను మరింతగా కఠినతరం చేస్తూ ఎక్కువ జీతాలందుకుంటున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఉద్యోగులను తొలగించిన 98 స్టార్టప్‌లలో 22 ఎడ్-టెక్ కంపెనీలే ఉన్నాయి. ఇవి మెుత్తంగా 9,781 మంది ఉద్యోగులను తొలగించాయి. అలాగే 2023లో ఇప్పటి వరకు 50 స్టార్టప్ కంపెనీలు దాదాపు 8000 మంది ఉద్యోగులను తొలగించాయి. తాజా డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 695 టెక్ కంపెనీలు ఈ ఏడాది మాత్రమే దాదాపు 1.98 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.

English summary

Layoff News: 27 వేల మందిని తొలగించిన స్టార్టప్ కంపెనీలు.. అసలు ఏం జరుగుతోందంటే..? | Indian startup companies layoffs 27000 employees amid funding winter, Valuations decreasing

Indian startup companies layoffs 27000 employees amid funding winter, Valuations decreasing
Story first published: Saturday, May 27, 2023, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X