కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా చమురుకు డిమాండ్ తగ్గడం వంటి వివిధ కారణాలతో చమురురంగ కంపెనీలు నష్టాలు చవిచూశాయి. దేశీయ టాప్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్చి క్వార్టర్‌లో భారీ నష్టాన్ని నమోదు చేసింది. నష్టాలు నాలుగేళ్ల తర్వాత భారీ నష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయని, దీంతో మార్జిన్లు పడిపోయాయని, ఈ ప్రభావం జనవరి - మార్చి క్వార్టర్ పైన పడిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ అన్నారు. మార్చి క్వార్టర్‌లో చమురు ధరలు 65.6 శాతం పడిపోయాయి.

రూ.5,185 కోట్ల నికర నష్టం
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రూ.5,185 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్‌లో రూ.6,100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్ష క్వార్టర్‌లో నిల్వలపై కంపెనీ రూ.14,692 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే సమయంలో నిల్వలపై రూ.2,655 కోట్ల లాభం వచ్చింది. బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా (స్థూల రిఫైనింగ్ మార్జిన్) 2019 జనవరి-మార్చిలో 4.09 డాలర్లు ఆర్జించగా, ఈసారి 9.64 డాలర్లు నష్టపోయింది. ఒకవేళ నిల్వలపై నష్టాలను మినహాయిస్తే 2.15 డాలర్లు ఆర్జించినట్లు అవుతుందని సంజీవ్ సింగ్ తెలిపారు.

వేగంగా కోలుకుంటుంది
కోరనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి నాటికి ఇంధన డిమాండ్ దేశంలో పడిపోయింది. ఇప్పుడు అమ్మకాలు పెరుగుతున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్‌కు కరోనా ముందు డిమాండ్‌కు రావాలంటే కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంధన డిమాండ్ ఊహించిన దాని కంటే ఎక్కువగానే కోలుకుంటుందని సంజీవ్ సింగ్ చెప్పారు.

జూలై చివరి నాటికి 100 శాతం
ఇంధన డిమాండ్ 80 శాతం నుండి 85 శాతం మేర పుంజుకుందని సంజీవ్ సింగ్ తెలిపారు. త్వరలో ఇది 90 శాతానికి చేరుకుంటుందని, 100 శాతానికి రావడానికి కాస్త సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం రిఫైనరీ 90 శాతం సామర్థ్యంతో ఉందని, జూలై చివరి నాటికి 100 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. దేశంలో ఐదు మిలియన్ బ్యారెల్స్ రిఫైనరీ సామర్థ్యం ఉండగా, ఇందులో మూడోవంతు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది.

ఐవోసీ లాభాలు..
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐవోసీ నికర లాభం రూ.రూ.1,313 కోట్లకు తగ్గింది. 2018-19లో నికర లాభం రూ.16,894 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిల్వలపై రూ.12,531 కోట్ల నష్టం వచ్చింది. అదే 2018-19లో నిల్వలపై రూ.3,227 కోట్ల లాభాన్ని గడించింది. చైన్నై పెట్రోలియం.. ఐవోసీ అనుబంధ సంస్థ.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications