For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం దిగుమతులు సరికొత్త రికార్డ్, 471 శాతం జంప్

|

కరోనా మహమ్మారి కాలంలో క్షీణించిన పసిడి దిగుమతులు క్రమంగా కోలుకుంటున్నాయి. తాజాగా దాదాపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద కన్స్యూమర్ భారత్. 2021 మొదటి మూడు నెలల కాలంలో 190 టన్నుల బంగారం దిగుమతులు నమోదయ్యాయి. ఇక మార్చి నెలలో దాదాపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. మార్చి నెలలో ఓవర్సీస్ కొనుగోళ్లు దాదాపు ఏడింతలు పెరిగి 98.6 టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 13 టన్నులు మాత్రమే. మే 2019 తర్వాత ఇదే గరిష్టం. బంగారం దిగుమతులు 471 శాతం పెరుగుదలతో సరికొత్త రికార్డును తాకింది.

వరుసగా 4వ ఏడాది: మారుతీ దూకుడు, అత్యధికంగా అమ్మడైన 5 కార్లు ఇవేవరుసగా 4వ ఏడాది: మారుతీ దూకుడు, అత్యధికంగా అమ్మడైన 5 కార్లు ఇవే

బంగారం దిగుమతులు రెండింతలు

బంగారం దిగుమతులు రెండింతలు

2021 క్యాలెండర్ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో బంగారం దిగుమతులు రెండింతల కంటే ఎక్కువ పెరిగి 190 టన్నులుగా నమోదయింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56,200 ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో ఇప్పుడు పసిడి ధర 17 శాతం క్షీణించి రూ.46వేలకు పైన పలుకుతోంది. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

కరెంట్ లోటు పెరిగే ఛాన్స్

కరెంట్ లోటు పెరిగే ఛాన్స్

బంగారం దిగుమతుల పెరుగుదల వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరిగే అవ‌కాశాలు ఉంటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3 త్రైమాసికాలలో దిగుమతులు తగ్గడం వల్ల కరెంట్ ఖాతా మిగులులో ఉన్న‌ది. అయితే, దిగుమతుల పెరుగుదల కారణంగా అది మళ్ళీ లోటులోకి చేర‌వ‌చ్చని నిపుణుల అంచనా.

అందుకే దిగుమతులు జంప్

అందుకే దిగుమతులు జంప్

బంగారం డిమాండ్ క్రమంగా పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ధరలు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలకు పైగా తగ్గడం. రెండోది ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించడం కూడా దిగుమతులు పెరగడానికి దోహదపడ్డాయని చెబుతున్నారు.

English summary

బంగారం దిగుమతులు సరికొత్త రికార్డ్, 471 శాతం జంప్ | Indian gold imports set a new record, rising 471 percent

The best performing precious metal for the week was silver, up 1.18% as hedge funds boost net-long silver positions to a three-week high. Gold rose on Thursday as the dollar weakened after dovish rhetoric from the Federal Reserve, which gave no indication of imminent tightening of monetary policy, reports Bloomberg.
Story first published: Wednesday, April 14, 2021, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X