For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా ఐతే పరిస్థితి దారుణం: ఇండియా లాక్‌డౌన్‌పై ప్రపంచ కీలక వ్యాఖ్యలు

|

ఇప్పటికే గత ఏడాది ఆర్థిక మందగమనంలో కూరుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు కరోనా మహమ్మారి మరింత గుదిబండలా మారిందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. 'సౌత్ ఆసియా ఎకనమిక్ అప్‌డేట్: ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్ 19' పేరిట ఆదివారం విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 2.8 శాతానికి కుంచించుకుపోతుందని తెలిపింది.

భారత్‌కు కరోనా షాక్: ఈ రంగంలోనే ప్రమాదంలో 1.5కోట్ల ఉద్యోగాలుభారత్‌కు కరోనా షాక్: ఈ రంగంలోనే ప్రమాదంలో 1.5కోట్ల ఉద్యోగాలు

మూడేళ్లలో భారత ఆర్థిక వృద్ధి ఇలా..

మూడేళ్లలో భారత ఆర్థిక వృద్ధి ఇలా..

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) వృద్ధి రేటు 2.8 శాతానికి పడిపోతుందని తెలిపింది. 20222లో తిరిగి 5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని పేర్కొంది.

ఈ రంగంలోనే గడ్డు పరిస్థితి

ఈ రంగంలోనే గడ్డు పరిస్థితి

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ ప్రతికూల ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేసిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్‌ను పొడిగిస్తే ప్రపంచ బ్యాంకు అంచనాల కంటే ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశముందని పేర్కొంది. అన్ని రంగాలతో పోలిస్తే సేవా రంగంలో ఎక్కువ గడ్డు పరిస్థితులు ఉంటాయని తెలిపింది.

పెట్టుబడుల్లో జాప్యం

పెట్టుబడుల్లో జాప్యం

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతికూలతల నేపథ్యంలో దేశంలో పెట్టుబడుల్లో జాప్యం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని తెలిపింది. కానీ వచ్చే సంవత్సరానికి పుంజుకుంటుందని తెలిపింది. లాక్ డౌన్ సుదీర్ఘకాలం ఉంటే మాత్రం ప్రపంచబ్యాంకు అంచనా కంటే ఆర్థికరంగంపై భారీ ప్రభావం ఉంటుందని తెలిపింది.

ప్రతికూలత కట్టడి చేయాలంటే..

ప్రతికూలత కట్టడి చేయాలంటే..

ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలత తగ్గాలంటే కరోనా వ్యాప్తిని సాధ్యమైనంత త్వరగా కట్టడి చేయాలని ప్రపంచ బ్యాంకు సౌత్ ఏసియా చీఫ్ ఎనకమిస్ట్ హన్స్ టిమ్మర్ అన్నారు. దేశంలో ఆహార కొరత లేకుండా జాగ్రత్తపడాలన్నారు. బ్యాంకు దివాళాలను అరికట్టాలని సూచించారు. ప్రజలకు స్థానికంగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలకు ఊతం

ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలకు ఊతం

కరోనా వ్యాప్తిని మొదటి దశతోనే ఆగిపోయేలా చూడాలని హన్స్ టిమ్మర్ అన్నారు. ఇది సవాల్‌తో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక ఉద్యోగాలపై, ముఖ్యంగా లోకల్ లెవల్‌లో దృష్టి సారించాలని సూచించారు. ఎంఎస్ఎంఈలకు ఊతమివ్వాలని సూచించింది.

English summary

అలా ఐతే పరిస్థితి దారుణం: ఇండియా లాక్‌డౌన్‌పై ప్రపంచ కీలక వ్యాఖ్యలు | Indian Economy to Decelerate to 5% in 2020: World Bank

The World Bank on Sunday said the coronavirus outbreak has severely disrupted the Indian economy, magnifying pre-existing risks to its outlook.
Story first published: Sunday, April 12, 2020, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X