For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021 పసిడి దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా జంప్

|

భారత్ బంగారం దిగుమతులు 2021 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పెరిగాయి. కరోనా కారణంగా 2020లో 430.11 టన్నులకు పడిపోయిన దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ మేరకు జెమ్స్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) గురువారం తెలిపింది. కరోనా ముందు 2019 క్యాలెండర్ ఏడాదితో పోల్చినా పసిడి దిగుమతులు 836.38 టన్నుల నుండి 27.66 శాతం పెరిగి, 1067.72 టన్నులకు చేరుకున్నాయి.

అత్యధికంగా స్విట్జర్లాండ్ నుండి 469.66 టన్నుల దిగుమతులు నమోదయ్యాయి. ఆ తర్వాత యూఏఈ నుండి 120.16 టన్నులు, సౌత్ ఆఫ్రికా నుండి 71.68 టన్నులు, గినియా నుండి 58.72 టన్నులు ఉన్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక పసిడి దిగుమతులు చేసుకునే దేశం భారత్. 2015లో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయింది.

Indias gold imports bounced back to 1067 tons in 2021

2021-22 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య నెలవారీ సగటు పసిడి దిగుమతులు 76.57 టన్నులుగా నమోదయ్యాయి.

English summary

2021 పసిడి దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా జంప్ | India's gold imports bounced back to 1067 tons in 2021

Gold imports bounced back to 1,067 tonnes in 2021 from 430.11 tonnes during 2020 when the demand was hit due to the COVID-19 pandemic, Gem Jewellery Export Promotion Council said on Thursday. The gold imports in 2021 were up by 27.66 per cent from 836.38 tonnes during 2019, it said in a statement.
Story first published: Friday, March 11, 2022, 8:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X