For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు కాస్త సానుకూలం? గత లాక్‌డౌన్‌తో పోలిస్తే...

|

2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధి రేటు కాస్త పెరగవచ్చునని వివిధ రేటింగ్ ఏజెన్సీలు, ప్రముఖ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 0.5 శాతం నుండి 2.3 శాతం మేర ఉండవచ్చునని భావిస్తున్నారు. తద్వారా గత ఆర్థిక సంవత్సరం పూర్తి ఏడాదికి వృద్ధి రేటు మైనస్ 7 శాతం నుండి మైనస్ 8 శాతం మధ్య ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 2020-21 మొదటి త్రైమాసికంలో ఏకంగా మైనస్ 23.9 శాతం నమోదయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ సంపూర్ణ లాక్ డౌన్ ప్రభావం ఎక్కువగా పడింది. అయితే దీని వల్ల లక్షల ప్రాణాలు పోకుండా కాపాడినట్లయింది.

వృద్ధి రేటు అంచనాలు

వృద్ధి రేటు అంచనాలు

2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు ప్రతికూలంగానే ఉండనుంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా ఉద్యోగ సంక్షోభం రానున్న రోజుల్లో ఎక్కువగానే కనిపించే అవకాశముందని భావిస్తున్నారు. భారత ఆర్థిక వృద్ధి అంచనాలపై న్యూస్ ఏజెన్సీ రూటర్స్ ఆర్థికవేత్తల నుండి అభిప్రాయాలు తీసుకుంది. 29 మంది ఆర్థికవేత్తల్లో ఎక్కువమంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.8 శాతం దిగువనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ అంచనాలను 10.4 శాతంగా పేర్కొన్నారు.

గోల్డ్ మన్ శాక్స్ అంచనా

గోల్డ్ మన్ శాక్స్ అంచనా

గోల్డ్‌మన్ శాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటును తగ్గించింది. సవరించిన అంచనాల ప్రకారం 31 మార్చి 2022 నాటికి భారత్ 11.1 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. తాజాగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో అంచనాలను మార్చింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే దేశంలో కరోనా మరణాలు 2.2 లక్షలు దాటాయి. రోజువారి కేసులు ఇటీవలి వరకు 4 లక్షలు కాగా, ప్రస్తుతం 2 లక్షల దిగువకు వచ్చాయి.

గత లాక్ డౌన్‌తో పోలిస్తే...

గత లాక్ డౌన్‌తో పోలిస్తే...

లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే తక్కువ తీవ్రతతో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు విధించిన ఆంక్షల తీవ్రతను గత ఏడాది ఆంక్షల తీవ్రతతో పోల్చి చూస్తే తక్కువగానే ఉన్నట్లు పేర్కొంది. అయితే తగ్గుతున్న ఈ వే-బిల్లుల వినియోగం, రైళ్లలో సరకు రవాణ రద్దీ తగ్గడం, కార్గో ట్రాఫిక్ వంటివి పరిశీలిస్తే జీడీపీ అంచనాలు తగ్గుతాయని పేర్కొంది. ఈ మేరకు అంచనాలను 11.7 శాతం వృద్ధి నుంచి 11.1 శాతం వృద్ధికి తగ్గించింది. 2021 క్యాలెండర్ ఇయర్ ఆర్థిక వృద్ధి 10.5 శాతం నుండి తగ్గి 9.7 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది.

English summary

మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు కాస్త సానుకూలం? గత లాక్‌డౌన్‌తో పోలిస్తే... | India's GDP Growth Likely To Improve In March Quarter?

The economy may have grown in the January-March quarter of the financial year 2020-21, according to estimates by leading rating agencies and economists. For the fourth quarter of fiscal 2020-21, agencies and research reports have suggested that the gross domestic product (GDP) grew in the range of 0.5-2.3 per cent, while the economy could record a contraction between 7-8 per cent in the entire fiscal year.
Story first published: Monday, May 31, 2021, 9:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X