For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: హైదరాబాద్ కంపెనీ ఘనత... తొలి వాక్సిన్‌కు ప్రభుత్వ అనుమతి!

|

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వాక్సిన్ (టీకా) రూపొందించటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతా భావించినట్లే జరుగుతోంది. లాక్ డౌన్ విధించిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తున్న కొన్ని వాక్సిన్ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ కు వాక్సిన్ హైదరాబాద్ నుంచే వస్తుందని అయన చెప్పారు. సరిగ్గా దానిని నిజం చేసేలా ఒక కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ కేంద్రంగా వాక్సిన్ లను తయారు చేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఒక కీలక మెయిలు రాయిని అధిగమించింది.

కొవాక్సీన్ పేరుతో రూపొందించిన కరోనా టీకా కు ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇండియా లో రూపొందించి, అనుమతి సాధించిన తొలి కరోనా వైరస్ టీకాగా భారత్ బయోటెక్ కు చెందిన కొవాక్సీన్ నిలిచింది. దీనికి అనుమతులు మంజూరు కావటంతో త్వరలోనే కొవాక్సీన్ టీకాను మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఒకటో దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు.\

అమెరికాలో ఉన్నవారికీ ట్రంప్ దెబ్బ! ఏ ఇండియన్ ఐటీ కంపెనీలో ఎంతమంది మనోళ్లు?

ప్రభుత్వ భాగస్వామ్యం...

ప్రభుత్వ భాగస్వామ్యం...

కరోనా వైరస్ కు వాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో ఫార్మా, బయోటెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కానీ, ఇందులో పురోగతి సాధించినవి కేవలం కొన్ని మాత్రమే. ప్రస్తుతం విజయవంతంగా వాక్సిన్ ను అభివృద్ధి చేసిన జాబితాలోకి భారత్ బయోటెక్ చేరిపోయింది. అయితే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఐన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ , పూణే, లు భారత్ బయోటెక్ కు ఈ వాక్సిన్ ట్రైట్ ను అందించి ఇతోధిక సాయం చేశాయి. తన వద్ద నున్న అత్యుత్తమ శాస్త్రవేత్తలు, వేరో సెల్ కల్చర్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో భారత్ బయోటెక్ టీకాను వేగంగా అభివృద్ధి చేయగలిగింది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ లో కూడా విజయవంతమైతే... మానవాళిని పట్టిపీడిస్తున్న మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

హైదరాబాద్ ల్యాబ్ లో నే...

హైదరాబాద్ ల్యాబ్ లో నే...

భారత్ బయోటెక్ కు హైదరాబాద్ లో ఉన్న అధునాతన లాబరేటరీ లోనే కరోనా వైరస్ టీకాను అభివృద్ధి చేయటం విశేషం. హైదరాబాద్ ఇప్పటికే దేశానికి ఫార్మా, బయోటెక్ హబ్ గా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో తయారయ్యే మొత్తం ఔషధాల్లో మూడోవంతు, ఇండియా నుంచి విదేశాలకు ఎగుమతి చేసే ఔషధాల్లో కూడా మూడో వంతు వాటా తో మన నగరం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలు కలిగి ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, నోవార్టిస్, సనోఫి, ఫైజర్, మైలాన్, అరబిందో ఫార్మా, దివీస్ లాబొరేటరీస్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. వీటికి తోడు వాక్సిన్ లు తయారు చేసే శాంతా బయోటెక్, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్ లిమిటెడ్, బయోలాజికల్ ఈ వంటి దిగ్గజాలు కూడా ఇక్కడ తమకార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

తయారీ కూడా ఇక్కడే...

తయారీ కూడా ఇక్కడే...

ప్రస్తుతం ప్రపంచంలోని 200 దేశాల ప్రజలు కరోనా వైరస్ వాక్సిన్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రపంచ మానవాళికి మేలు జరుపుతుంది. అందుకే, ప్రపంచ ఫార్మా, బయోటెక్ దిగ్గజాలు అన్నీ వాక్సిన్ పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వాలు కూడా తీవ్రతను గుర్తించి వాక్సిన్ లకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయి. దీంతో ప్రపంచంలో ఎక్కడ కరోనా వాక్సిన్ అభివృద్ధి చేసినా కూడా వాటిని ఇండియా లో, ముఖ్యంగా హైదరాబాద్ లో తయారు చేసేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే, మన దగ్గర అతి తక్కువ ధరలో ఎక్కువ మోతాదులో వాక్సిన్ లను అభివృద్ధి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, భారత్ బయోటెక్ రూపిందించిన కొవాక్సీన్ ఐనా మరో వాక్సిన్ అయినా... మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ హైదరాబాద్ బ్రాండ్ వాడాల్సిందేనని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు.

English summary

India's first COVID 19 vaccine COVAXIN by Bharat Biotech gets DCGI approval for human trials

India's first ever Covid vaccine - Covaxin - got the regulatory permissions from the Drug Controller General of India (DCGI). Hyderabad based Bharat Biotech International has developed this vaccine and is going to conduct the first and second stage of clinical trials on humans. Once successful in clinical trials, Covaxin is going to be released into the market very shortly, according to the company management. In association with ICMR and National Institute of Virology, Pune, Bharat Biotech could bring in the successful vaccine candidate much before any other Indian vaccine makers thereby proving its capabilities to manufacturing the mission critical vaccine for the pandemic.
Story first published: Tuesday, June 30, 2020, 9:01 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more